చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లోని 221/1లో నివాసం ఉండే మేము ఆ ఇంటి పేరుతో రైల్వే కాలనీ నేపథ్యంలో ఓ సినిమా తీయాలని ఉందని ప్రముఖ సినీ రచయిత, నటుడు , ప్రయోక్త తనికెళ్ళ భరణి తన మనసులోని మాటను దక్షిణ మధ్య రైల్వే నిర్వహించిన ఉగాది పురస్కారసభలో వెల్లడించారు.. రైల్వే కాలనీలు, మినీ ఇండియాను తలపించేవని దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడే ఉన్నందున అప్పట్లో అన్ని పండుగలను ఘనంగా నిర్వహించుకునేవాళ్లమని రైల్వే కాలనీ లో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.. విమానంలో ఎన్ని సౌకర్యాలున్నప్పటికి రైలు ప్రయాణం అంటేనే తనకి విపరీతమైన మక్కువ అని చెప్పుకొచ్చారు. యూరప్ లో రైలు ప్రయాణానికే అక్కడి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ప్లాట్ ఫామ్ టికెట్ కొనకుండా ఏ రైల్వే స్టేషన్లోనూ ఇంతవరకు ప్లాట్ ఫామ్ ఎక్కలేదని తన తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఇండియా మొత్తాన్ని మూడుసార్లు తిరిగానని చెప్పుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి ఆధ్వర్యంలో సికిం ద్రాబాద్ రైల్ నిలయం ఆడిటోరియంలో జరిగిన ఉగాది పురస్కారంతో సత్కరించిన సందర్భంలో మాట్లాడారు.. ఇదే కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా హాజరైన మాటల రచయిత డాక్టర్ బుర్రా సాయిమాధవ్ తన ప్రసంగంలో తన గురువైన తనికెళ్ల భరణికి రైల్వే తరుఫున సత్కారం జరగడం, మంచి మనసున్న మనిషికి జరుగుతున్న సత్కారంగా అభివర్ణించారు.
previous post