Vaisaakhi – Pakka Infotainment

నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే..

అదిరిపోయే సంగీతం… మెస్మ‌రైజ్ చేసే విజువ‌ల్స్‌… హైక్లాస్ మేకింగ్‌.. ఊర‌మాస్ స్టెప్స్‌… క్లాప్ కొట్టించే ఐకాన్‌స్టార్ స్వాగ్‌… విన‌గానే వావ్ అనిపించే లిరిక్స్‌.. ఇలా ఒక‌టేమిటి.. పుష్ప‌… పుష్ప‌…పుష్ప.. పుష్ప‌రాజ్.. దేశం ద‌ద్ద‌రిలే.. ఈ పాట వింటూంటే అంద‌రికి గూస్బంప్స్‌.. ఇక ఐకాన్‌స్టార్ అభిమానుల సంబరం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. అంద‌రూ ఎంతో ఎదురుచూస్తున్న పుష్ప‌-2 ది రూల్ లోని తొలి లిరిక‌ల్ వీడియోకి దేశవ్యాప్తంగా వ‌స్తున్న అప్లాజ్ అది.. పుష్ప‌… పుష్ప‌…పుష్ప.. పుష్ప‌రాజ్.. నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే.. దేశం ద‌ద్ద‌రిలే.. అనే లిరిక‌ల్ వీడియోను బుధ‌వారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌… చంద్ర‌బోస్ లిరిక్స్ అందించిన ఈ పాట హై మాసివ్‌గా పూర్తి క‌మ‌ర్షియ‌ల్‌గా సాంగ్‌గా వుంది. చిత్రంలో పుష్ప ది రూల్‌ను ఎలివేట్ చేసే విధంగా, పుష్ప క్యారెక్ట‌రైజేష‌న్ మీద సాంగ్ వుంది. విన‌గానే అంద‌రికి ఈ పాట ఎంతో న‌చ్చే విధంగా వుంది. విజ‌య్ పొల్లంకి, శ్రేష్టి వ‌ర్మ కొరియోగ్ర‌ఫీ అందించిన ఈ పాట‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుద‌ల చేశారు. తాజాగా వ‌దిలిన ఈ పాట‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో మునిగి పోయారు..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More