Vaisaakhi – Pakka Infotainment

పుష్ప -2 ద రూల్ నుంచి రాబోతున్న రెండో లిరిక‌ల్ సాంగ్

పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ తొలి లిరిక‌ల్ సాంగ్‌తో ప్ర‌పంచ‌వ్యాప్త శ్రోత‌ల‌ను అల‌రించి.. యూట్యూబ్ వ్యూస్‌లో ఆల్ టైమ్ రికార్డులు నెల‌కొల్పిన పుష్ప‌-2 ది రూల్‌లోని పుష్ప‌రాజ్ టైటిల్ సాంగ్ ఇంకా మారుమోగుతూనే వున్న టైమ్ లొనే ఇప్పుడు తాజాగా మ‌రో లిరిక‌ల్ అప్‌డేట్‌ను ఇచ్చారు పు్‌ష్ప‌-2 మేక‌ర్స్‌.. ఈ సారి చిత్రంలోని హీరోయిన్ శ్రీ‌వ‌ల్లి వంతు వ‌చ్చింది. పుష్ప‌రాజ్ జోడి అయిన శ్రీ‌వల్లి పుష్ప‌రాజ్‌తో క‌లిసి పాడుకున్న మెలోడి సాంగ్‌ను క‌పుల్ సాంగ్‌గా నెల 29న ఉద‌యం 11:07 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ప్రోమోలో కేశ‌వ వాయిస్‌తో సెకండ్ సాంగ్ గురించి ర‌ష్మిక‌ను అడుగుతాడు .మేక‌ప్ వేసుకునేందుకు సిద్దంగా వున్న శ్రీ‌వ‌ల్లి సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ*వుంటాడే నా సామి అంటూ ఆమె పాడుతూ ఐకానిక్ స్టెప్పుతో అల‌రించింది. ఈ ప్రోమో చూసి సాంగ్ అదిరిపోయే మెలోడిలా వుండ‌బోతుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో త‌న న‌ట‌న‌తోమొట్ట‌ మెద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం,మెట్ట మెద‌టిసారిగా ద‌క్షిణ భార‌తదేశ న‌టుడు దుబాయ్ లొ మ్యాడ‌మ్ టుసార్ట్ లో స్టాట్యూ క‌ల‌గ‌ట‌మే కాకుండా మెద‌టి తెలుగు న‌టుడుగా గ్యాల‌రీ ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు పుష్ప చిత్రంతోనే సంత‌రించుకున్నాయి. ఇక త్వ‌ర‌లోపుష్ఫ 2 తొ మ‌రోక్క‌సారి ప్ర‌పంచం లోని సినిమా అభిమానులంతా ఒక్క‌సారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాలు తెలుగు సినిమా చ‌రిత్రలొ మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్ని ఎదురుచూస్తున్నాయి..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More