ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో లో వచ్చిన సలార్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు సలార్ 2 ని కూడా అంతకు మించి హిట్ చెయ్యాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్కెచ్ వేస్తున్నారు.. మే ఎండింగ్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసి నవంబర్ కు కంప్లీట్ చేసి 2025 సమ్మర్ కి రిలీజ్ చేయాలన్న ప్లాన్ పై వర్క్ చేస్తున్నట్లు తెలిసింది.. ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కమిట్మెంట్స్ ని ఒక్కొక్కటిగా ఫినిష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.. తెలుగు నటుల్లో మరెవ్వరూ ఇన్ని సినిమాలతో బిజీ గా లేరు కల్కి ఆల్మోస్ట్ పూర్తయి రిలీజ్ కు దగ్గరగా వుండాగా రాజసాబ్, కన్నప్ప, షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నాయి.. అన్ని అనుకున్నట్లు జరిగితే సలార్ 2 స్పిరిట్ రెండు అతి త్వరలో సెట్స్ కి వెళ్లే అవకాశం ఉంది.. తన అభిమానులను , టాలీవుడ్ ను ప్రభాస్ డిసప్పాయింట్ చేసే అవకాశం ఏమాత్రం లేదు.. ఈ రెండు షూటింగ్స్ ప్రారంభం అయ్యే సమయంలోనే మైత్రి మూవీస్ హనురాఘవపూడి కాంబో లో ఫౌజీ సెట్స్ వెళ్లొచ్చు.. మూడు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ గాప్ ఇవ్వకుండా ఆడియన్స్ ని మెసమెరైజ్ చేస్తాడన్న గ్యారంటీ అయితే ఉంది..