సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. నుండి పీలింగ్స్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్ర బోస్ లిరిక్స్ రాయగా శంకర్ బాబు కందుకూరి, లక్ష్మి దాస తమ స్వరాన్ని జోడించి ఈ పాటను పాడడం జరిగింది. ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే అల్లు అర్జున్, రష్మిక మందన్నతో కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా డాన్స్ స్టెప్పులు వేసినట్లు తెలుస్తుంది. ఈ పాటలో వింటేజ్ అల్లు అర్జు చూస్తారు, మలయాళం లిరిక్స్ తో మొదలై ఆ తర్వాత తెలుగు లిరిక్స్ తో కొనసాగుతుంది. “ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల కాగా అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ సాంగ్ తో చిత్ర బృందం ప్రేక్షకులను అలరించనుంది. 2021లో విడుదల అయిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవిశంకర్ యెలమంచిలి నిర్మిస్తున్నారు.