Vaisaakhi – Pakka Infotainment

పఠాన్ వర్సెస్ ఆది పురుష్ బాలీవుడ్ లో ఆరని లొల్లి..

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మధ్య ఇండియన్ బాక్సాఫీస్ పై ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కొన్నాళ్లపాటు వరుస ప్లాపులను మూట గట్టుకున్న షారుక్ ఖాన్ పఠాన్ మూవీతో కలెక్షన్ల సునామిని సృష్టించాడు. ఓవరాల్ గా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో 1000 కోట్ల రూపాయలను సాధించిన హీరో గా షారుఖ్ ఖాన్ రికార్డ్ సాధించాడు. షారుక్ తన ప్రభావాన్ని మళ్లీ దక్కించుకోవడంతో నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే హీరో షారుక్ మాత్రమేనని లొల్లి ప్రారంభించారు. ఈ క్రమంలో సౌత్ హీరోలను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేశారు. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా కు మొదటి నుంచి కొందరు కావాలని పనికొట్టుకుని నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వీడియో సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ను ఏర్పడేలా చేసింది. ఈ సినిమాకు ఊహించని విధంగా బుక్ మై షో లో టికెట్స్ బుకింగ్ జరగడం ఒక రికార్డు గా నెలకొంది. దీనిని కూడా నార్త్ ఆడియన్స్ ఫేక్ అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు షారుక్ ఫ్యాన్స్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో కొత్త లొల్లి ప్రారంభమైంది. షారుక్ పఠాన్ మూవీ రికార్డ్స్ ను ఆది పురుష్ మూవీ బ్రేక్ చేయలేదని, అది ఒక కార్టూన్ సినిమా అంటూ నెగటివ్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అస్సలు ప్రభాస్ రాముడు గా సెట్ కాలేదని ఆ క్యారెక్టర్ కు బాలీవుడ్ చెందిన హృతిక్ రోషన్ చేసి ఉంటే సినిమాకు మరింతగా హెల్ప్ అయ్యేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముని క్యారెక్టర్ చేసే హీరో సినిమాకు హెల్ప్ అవ్వాలి అలాగే పెట్టిన బడ్జెట్ తిరిగి తీసుకు రాగల పాపులర్ హీరో అయి ఉండాలి. ఒకవేళ హృతిక్ రోషన్ హీరో అయి ఉంటే అది హిందీ బెల్ట్ వరకు మాత్రమే కలెక్షన్ ప్రభావం ఉండేది. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆది పురుష్ మూవీకి రెట్టింపు కలెక్షన్లు తీసుకురాగల సత్తా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు మాత్రమే ఉంది. బాహుబలి సిరీస్ తో భాషా బేధం లేకుండా హిందీ తో పాటు అన్ని ప్రాంతీయ భాషా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్ మాత్రమే ఈ సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అవుతాడని భావించి రాముని క్యారెక్టర్ కి తీసుకోవడం జరిగింది. దీనికి తోడు అతను క్షత్రియుడు కావడం కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చేసింది. మరొక హీరో అయితే ఈ వాటికి విశ్వహిందూ పరిషత్తు, బిజెపి తో పాటు ఇతర హిందూ మతవాద సంస్థలు రచ్చ రచ్చ చేసేవి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బిజెపి పార్టీకి చెందిన నాయకుడు కావడం, ప్రభాస్ కూడా బిజెపికి దగ్గరగా ఉండటంతో ఈ క్యారెక్టర్ అతనితో చేయించాలని డిసైడ్ అయ్యారు. ప్రభాస్ ఎంపిక వెనకాల బిజెపి తో పాటు కేంద్ర పెద్దలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వద్దాం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ హీరోలు వెర్షస్ ప్రభాస్ గా మారింది వ్యవహారం. ఇతర ప్రాంతీయ చిత్రాల వరకైతే పర్లేదు కానీ ప్రభాస్ బాలీవుడ్ లో టాప్ స్టార్ గా పాతుకు పోవడమే బాలీవుడ్ జనాలకు నచ్చడం లేదు. అక్కడ హీరోలు బయటకు బాగా నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ వారికి కూడా బాలీవుడ్ పై టాలీవుడ్ హీరోల ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. పఠాన్ మూవీ విడుదలైన 29 రోజుల్లో 1005 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేసింది. ఇందులో 384 కోట్లు ఓవర్‌సీస్‌ మార్కెట్‌ ద్వారా లభించాయని దేశీయంగా 511 కోట్లు హిందీ బెల్ట్‌ నుంచే వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. తాజా వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో వెయ్యికోట్ల మైలురాయిని దాటిన ఐదో చిత్రంగా ‘పఠాన్‌’ నిలిచింది. అంతకు ముందు దంగల్‌, బాహుబలి-2, కేజీఎఫ్‌-2, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు వెయ్యికోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు నమోదు చేశాయి. ఇప్పుడు ఆది పురుష్ మూవీ ఈ రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యమనే ప్రచారాన్ని మొదలుపెట్టేశారు నిజానికి ఈ సినిమా బాగా ఆడాలని నార్త్ లోనే ఎక్కువమంది కోరుకుంటున్నారు. ఈ సినిమా చూడాలని నార్త్ బెల్ట్ లోనే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మొదటి రోజు వచ్చే కలెక్షన్లు బట్టి ఈ సినిమాఏ రేంజ్ కలెక్షన్ లు వసూలు చేస్తుందనేది స్పష్టమవుతుంది. మొదటి రోజు కలెక్షన్లు 100 కోట్లకు పైగా ఉండొచ్చనే పలువురు సినీ విశ్లేషకులు అంచనా వేస్తుండగా ఓవరాల్ గా వారం రోజులలో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ పూర్తిగా రికవరీ అయ్యి మరిన్ని లాభాలను తీసుకురావడం ఖాయమని పలువురు విశ్లేషిస్తున్నారు. బాలీవుడ్ ఖాన్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకి మరింతగా పెరుగుతుంది. దీనిని అక్కడ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ ఈ సినిమా ద్వారా పఠాన్ మూవీ రికార్డులను కొడితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ టైగర్‌ -3 ద్వారా ఆది పురుష్ రికార్డులను చెరిపేయడం ఖాయమని ఖాన్ త్రయం అభిమానులు చెబుతున్నారు. ప్రభాస్ నుంచి నెక్స్ట్ సలార్ మూవీ ఈ ఏడాది చివర్లో రాబోతుంది. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీ సరికొత్త రికార్డులను సెట్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. మళ్లీ షారుక్ తన తదుపరి చిత్రాలు జవాన్, డన్ కి చిత్రాల ద్వారా ఇండియన్ బాక్సాఫీస్ పై దండెత్తడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత కూడా ప్రభాస్, షారుక్ ల మధ్య పోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండియన్ నంబర్ వన్ హీరో ప్రభాస్ అంటూ ఒకపక్క, బాక్సాఫీస్ బాద్షా షారుక్ అంటూ మరో పక్క జరుగుతున్న వివాదం మాత్రం ఇప్పట్లో ఆగే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. ఇద్దరు హీరోల వారి రాబోయే చిత్రాలే నిజమైన ఇండియన్ నెంబర్ వన్ హీరో ఎవరనేది తెలియజేస్తాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More