Vaisaakhi – Pakka Infotainment

జీ5 ఒరిజినల్ ‘పరువు’ ట్రైలర్‌ విడుదల

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన జీ5 (ZEE5) ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా రాబోతోన్న ఈ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మొదటి ఎపిసోడ్‌ను అందరూ ఫ్రీ గానే వీక్షించవచ్చు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే పరువు అనే టైటిల్ ఎందుకు పెట్టారో క్లియర్‌గా అర్థం అవుతోంది. ఓ ప్రేమ జంట, కులాలు అడ్డు రావడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం, పరువు కోసం పేరెంట్స్ చేసిన డ్రామా.. ఆ జంటకు ఎదురైన కష్టాలు ఇలా అన్నింటిని ఎంతో ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? మర్డర్ కేస్ నుంచి ఎలా బయటపడ్డారు? పరువు హత్యకు గురవుతామని భయపడ్డ వాళ్లే.. ఓ హత్యను చేయడంతో ఎదురైన కష్టాలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తేలా ట్రైలర్ ఉంది.బిందు మాధవి ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇవ్వడం, నివేదా పేతురాజ్ బిందు మాధవి మధ్య వచ్చే సీన్ అదిరిపోయింది. ఇక నాగబాబు చాలా రోజులకు ఓ సీరియస్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ ఆర్ఆర్ ట్రైలర్‌లో అదిరిపోయింది. చింతా విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా ఉంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More