ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తనే దర్శక నిర్మాతగా మారి రూపొందించిన శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా విడుదలయి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెరమీదకి రావడానికి చాలా కథ నడిచింది. వరుసగా ముగ్గురు హీరోలు మూడుసార్లు ఈ సినిమా చేస్తానని ప్రకటించిన తర్వాతఆ సినిమా ఆగిపోవడం జరిగింది. అయితే నాలుగో సారి ఎన్టీఆర్ ఆ ప్రయత్నం చేసి విజయం సాధించారు. అయితే ఇదివరకు మూడుసార్లు ఈ సినిమా ఆగిపోవడంతో సెంటిమెంట్ గా ఆ సినిమా తీయకపోవడమే మంచిదని భావించినప్పటికి ఆయనకున్న ప్రజాభిమానం దృష్ట్యా ఆ సినిమా ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయకూడదని చాలామంది అభిమానులు భీష్మించుకుని కూర్చున్నారు. అలాగే వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రతినిధులు కూడా ఎన్టీఆర్ అయితే ఆ సినిమాకి న్యాయం జరుగుతుందని సినిమా చేయకుంటే మాత్రం తాము నిరసన దీక్షలు చేస్తామని చెప్పారు. ఇక తప్పని పరిస్థితిలో ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఎంతటి విజయ సాధించిందో అందరికీ తెలిసిందే. కానీ దానికి ముందు జరిగిన అసలు కథ ఏంటో ఒకసారి చూద్దాం. 1954 అగ్గి రాముడు సినిమా టైంలో స్వామి అనే ఒక వ్యాపారవేత్త కు పలువురు సినీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి.ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో కూడా ఆయనకు కాస్త చనువు ఉండేది. ఆయన 1954లోనే ఎన్టీఆర్ తో వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ కు ఒక ఖాళీ చెక్ ను కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కమలాకర్ కామేశ్వర రావును దీనికి దర్శకుడుగా తీసుకున్నారు.వెంటనే పనులు కూడా మొదలుపెట్టారు. సీనియర్ సముద్రాల, జూనియర్ సముద్రాల ఈ సినిమాకి రచయితలుగా డైలాగ్ వెర్షన్ వర్క్ కూడా కొనసాగుతూ ఉండేది. సంగీత దర్శకులు టివిరాజుతో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు. కొద్దిరోజుల సమయం తర్వాత నిర్మాత స్వామికి అపరిచిత వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ సినిమా చేస్తేవ్యాపారంలో బాగా నష్టపోతావు,నువ్వే పోతావ్ ప్రాణాలతో ఉండాలంటే సినిమా ఆపేయమని వార్నింగ్ ఇచ్చారట. దీంతో నిర్మాత స్వామి భయపడిపోయి ఎన్టీఆర్ వద్దకు వచ్చి తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కోసం చెప్పి తాను సినిమా చేయడం లేదని చెప్పాడు.దీంతో ఎన్టీఆర్ నిర్మాత ఇచ్చిన ఖాళీ చెక్ ను తిరిగి ఇచ్చేయబోతుండగా చెక్కు మీ వద్ద ఉంచండి మరో సినిమా కోసం దానిని మీకు అడ్వాన్స్ ఇస్తున్నట్లు ఉంచండి అని చెప్పారు. త్వరలోనే మనం కలిసి మరొక సినిమా చేద్దాం అని చెప్పాడు. అలా నిర్మాత సినిమా నుంచి తప్పుకున్నాడు. అది జరిగుంటే 1954లోనే ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా వచ్చి ఉండేది తర్వాత కొన్నాళ్లకు హీరో హరినాథ్ మద్రాసులోని కొడంబాకం లో ఒక ఆఫీస్ తీసుకొని వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. హీరో శ్రీధర్ ఇందులో సిద్దయ్యగా చేయడానికి అంగీకారం కుదిరింది. ఈ సినిమా మ్యూజిక్ రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో నిర్మాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రెండోసారి కూడా ఆగిపోయింది. ఆ తర్వాత ఏచూరి చలపతిరావు అనే వ్యక్తి వీరబ్రహ్మేంద్రస్వామి వారి చరిత్ర పుస్తకాన్ని ఎన్టీఆర్ కి బహూకరించారు. ఈ సినిమా రెండుసార్లు ఆగింది. ఇంకా దీనికోసం ఎందుకు ప్రయత్నం చేయడమని ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించారు. అయితే చాలామంది ఆయన సన్నిహితులు ఈ సినిమా చేయమని ఆయనకి చెప్పినప్పటికీ ఎన్టీఆర్ చేయనని ఖరాఖండిగా చెప్పేసారు. అయితే అదే సమయంలో హీరో విజయ్ చందర్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తో ఒక సినిమా చేస్తున్నట్లు పేపర్ ప్రకటన ఇచ్చాడు.ఈ విషయాన్ని అతని సన్నిహితులు ఎన్టీఆర్ కు తెలియజేశారు. అయితే ఇదిలా ఉండగా అదే సమయంలో ఫిలిం క్రిటిక్ అన్న పేపర్లో ఒక వార్త కథనం వచ్చింది. ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామిగా, బాలకృష్ణ సిద్ధప్పగా సినిమా చేయాలని, చేస్తే ఆ సినిమా అబాల గోపాలాన్ని అలరిస్తుందని, లేకపోతే తాము నిరసనలు చేస్తామని ఆ పాత్రలలో ఎన్టీఆర్, బాలకృష్ణలను తప్ప ఎవరిని ఊహించుకోలేమనే అభిమానులు పేరిట ఒక కథనం వచ్చింది. ఈ పేపరు వీరబ్రహ్మేంద్ర మఠానికి కూడా చేరింది. ఆ మఠం ప్రతినిధులు కూడా ఎన్టీఆర్ ఆ సినిమా చేయాలని పట్టుబట్టారు. లేకపోతే తాము సత్యాగ్రహం చేస్తామని వారు సున్నితంగా హెచ్చరించారు. అభిమానులు, మఠం ప్రతినిధుల అభ్యర్థన మేరకు ఎన్టీఆర్ సినిమా చేయడానికి అంగీకరించి ప్రకటన కూడా చేశారు. తర్వాత ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విజయచందర్ కి ఎన్టీఆర్ ఫోన్ చేసి తాను కూడా ఈ సినిమా తీయబోతున్నట్లు చెప్పారు. విజయ చందర్ కూడా మీలాంటి వ్యక్తులు చేస్తేనే ఆ సినిమా జనాలకి మరింత రీచ్ అవుతుంది. తప్పకుండా మీరే చేయాలి. నేను ప్రకటన మాత్రమే చేశాను. ఇక మీరు చెప్పిన తర్వాత ఈ సినిమా నేను చేయబోనని వెల్లడించి విజయ్ చందర్ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించారు. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఇక ఇదే సినిమాలో వీరబ్రహ్మేంద్రస్వామి ప్రియ శిష్యుడు అయిన సిద్దప్ప పాత్రలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటించారు. సిద్దయ్య పాత్ర కు హీరోయిన్ కి మధ్య జరిగే సంభాషణలు హిందువులు ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సన్నివేశాన్ని కత్తిరించేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ సన్నివేశం సినిమాలు ఉండాల్సిందే అంటూ పట్టుబట్టారు. అందులో తప్పేమీ లేదని ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సంభాషణలు లేవు అంటూ ఆ సన్నివేశం సినిమాలో పెట్టేందుకు మూడేళ్లపాటు న్యాయపోరాటం చేశారు. ఆ తర్వాత కేసు గెలిచారు. ఇక ఆ సీన్ కట్ చేయకుండానే సినిమాను విడుదల చేశారు.ఇక ఇలాఒక సీన్ కోసం ఎన్టీఆర్ మూడేళ్ల పాటు న్యాయ పోరాటం చేయడం మాత్రం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లోనే సంచలనంగా మారిపోయింది. 1984 నవంబర్ 29వ తేదీన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
previous post
next post