“ నెపోటిజం “ ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పదం … గూగుల్ లో నెటిజన్లు ఎక్కువుగా సెర్చింగ్ చేస్తున్న వర్డ్ … వర్ధమాన హింది నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో నెపోటిజం అన్నది బాగా చర్చ లోనికి వచ్చింది ఇప్పుడు సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు హత్యే అని ఓ డాక్టర్ మళ్ళీ తేనెతుట్టె ను కదల్చడంతో నేపోటిజమే యువ హీరో ను చంపేసిందన్న వాదనలు మళ్ళీ తెరపైకోచ్చాయి.. సినిమా పరిశ్రమకు చెందిన కంగనా రనౌత్ వంటి వారు అప్పుడే నెపోటిజం పై గొంతు విప్పటమే కాకుండా సీనియర్ నటులపై తీవ్రంగా ఆరోపణలు చేసిన సందర్బంలో మీడియా దృష్టంతా దీనిపై పడింది . గంటలు గంటలు చర్చలకు తెరలేపారు . నిజానికి నెపోటిజం అన్నీ రంగాల్లో వేళ్లూనుకుపోయిన వాస్తవాన్ని మరచిపోయి కేవలం సినిమా రంగంలో మాత్రమే ఈ తరహా వేదింపులు ఉన్నట్లు ప్రచారం జరగడం నిజంగా దురదృష్టకరమే … అసలు నెపోటిజం ఇప్పటికిప్పుడు పుట్టింది అసలే కాదు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సినిమా స్వర్ణయుగ సమయంలో కూడా ఎన్‌టిఆర్ , ఏ ఎన్ ఆర్ , చిరంజీవి వంటి అగ్ర నటులపై ఈ తరహా ఆరోపణలు బలంగానే వినిపించాయి …అవి హీరోలకే పరిమితం కాకుండా ఘంటసాల , బాలసుబ్రహ్మణ్యం వంటి గాన గంధర్వులనూ ఈ ఆరోపణలు వదలలేదు . కొత్త గొంతుకల నోరు నోక్కేస్తున్నారన్న అపోహలు హల్చల్ చేసిన విషయం గమనార్హం … యువనటుడు ఉదయ కిరణ్ ఆత్మహత్య చేసుకొన్న సమయంలోనూ కొన్ని మీడియా సంస్థలు ఓ నటుడిని టార్గెట్ చేసుకొని విష ప్రచారం చేశాయి . ఏతావాతా చెప్పొచ్చేదెందంటే … నెపోటిజం అనేది కేవలం సినిమా రంగంలోనే ఎక్కువ వుందన్న ప్రచారం మీడియా చేయటం క్షమించరాని నేరం … స్వాతంత్యం వచ్చిన దగ్గరనుండి దేశాన్ని శాసిస్తున్న నాలుగు ఎస్టేట్స్ లో కూడా నెపోటిజంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం విస్మరిస్తే ఎలా….? ఇందుకు ఏ రంగం మినహాయింపు కాదు . ఇరవై సంవత్సరాల క్రితం పార్టీ జెండా మోసిన కార్యకర్త ఈరోజు కూడా ఆ జెండాను మోస్తూనే వున్నాడు . వయస్సులో వచ్చిన మార్పు తప్ప మరింకేమి ఆ కార్యకర్తలో కనిపించదు … అలాగే వ్యాపార , పారిశ్రామిక రంగాల్లో ఈ బంధు ప్రీతికి ఏం తక్కువ లేదు … చివరాఖరికి ఉద్యోగ వర్గాల్లోకి కూడా ఇది చొచ్చుకుపోయింది … అలాంటిది వీటన్నిటినీ వదిలేసి కేవలం సినిమా రంగానికి మాత్రమే నెపోటీజాన్ని రుద్దే ప్రయత్నం మాత్రం అంత మంచిదికాదు … దీనిని ఖండిచాల్సిన అవసరం అందరికీ కాకపోయిన సినిమా వాళ్ళకి మాత్రం వుంది … ఎలాంటి నేరమైన , ఎలాంటి విషాదమైన … వర్గాలతోనూ , రంగాలతోనూ , కుల,మతాలతోనూ ముడిపెట్టకుండా వాస్తవ స్థితి గతుల్ని చర్చిస్తే సమాజానికి మేలు జరుగుతుంది . అంతేగానీ మిగిలిపోతున్న ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటల్ని ఒకే రంగంపై బురదజల్లెందుకు ఉపయోగిస్తే మీరనుకొన్న మెరుగైన సమాజం తిరగబడే రోజు ఖచ్చితంగా వస్తుంది ….
previous post