నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా #NKR21
బ్రాండ్ న్యూ పోస్టర్‌ను లాంచ్ చేసారు. కళ్యాణ్ రామ్ ఫెరోషియస్ అవతార్‌లో పిడికిలికి ఫైర్ తో కూర్చున్న పొసిషన్ లో తన చుట్టూ గూండాలని ఇంటెన్స్ గా చూస్తున్నట్లు పోస్టర్ పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసారు. స్టైలిష్ మేకోవర్ అయిన కళ్యాణ్ రామ్ వెరీ వైలెంట్ గా కనిపిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ చేయనున్నారు. నందమూరి హీరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా డైనమిక్ క్యారెక్టర్‌ని పోషిస్తోన్నారు. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.