రామ్ చరణ్ థియేటర్లలో పాత్ బ్రేకింగ్ చిత్రాలను నిర్మించడానికి ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నారు. ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ పై రూపొందనున్న సినిమాలకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి ప్రొడక్షన్ పార్ట్నర్. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన నిర్మాణ సంస్థ,
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరో నిర్మాణ భాగస్వామిగా వుంది. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ఇండియా హౌస్’. నిఖిల్ సిద్ధార్థ్, హీరో కాగా సాయి మంజ్రేకర్ హీరోయన్ గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమ ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఇండియా హౌస్’ ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1905 బ్యాక్ డ్రాప్ లో లవ్, రెవెల్యుషన్ థీం ని ఎక్స్ ఫ్లోర్ చేసే ఈ పీరియడ్ డ్రామా కోర్ టీం సమక్షంలో హంపి (కిష్కింద)లోని విరూపాక్ష దేవాలయంలో గ్రాండ్ గా పూజా కార్యక్రమం జరిగింది. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది.
టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పని చేస్తున్నారు. కెమరూన్ బ్రైసన్ డీవోపీ కాగా, విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్. ఈ ఎపిక్ మూవీకి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
next post