ఈ నెలలోక్రేజీ ప్రాజెక్ట్స్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండు సినిమాలు నెలతిరగకుండానే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కి వచ్చేసాయి… గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “భీమా” డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోండగా పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ 26నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. భీమా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఒక వీడియోలో ‘మ్యాజిక్ ఆఫ్ భీమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. “భీమా” చూడాల్సిందిగా కోరారు. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి “భీమా” సినిమా విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. కన్నడ దర్శకుడు ఎ హర్ష రూపొందించారు. “భీమా” చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ “భీమా” సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
previous post
next post