భారత హోం మంత్రిత్వ శాఖ మూడు కొత్త క్రిమినల్ చట్టాలను జులై ఒకటి నుంచి అమలులోకి తెనున్నట్టు ప్రకటించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023, మరియు భారతీయ సాక్ష్యా అధినియం, 2023, చట్టాలను జూలై 1, 2024 నుండి అమలులోకి వస్తాయని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్‌ను రద్దు చేస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, లను అనుసంధానిస్తూ భారత నేర న్యాయ వ్యవస్థను మరింత పదునుపెట్టనున్నాయి. కేంద్రీకృత విధానం ద్వారా న్యాయాన్ని అమలు చేయడం, జాతీయ భద్రతపై దృష్టిని పెంచడం మరియు డిజిటల్/ఎలక్ట్రానిక్ సాక్ష్యాధార సమీక్షలను ప్రవేశపెట్టడం, వాటిని ప్రాధాన్యతనివ్వడం తో క్రిమినల్ చట్టాలు మరింత కఠినం కానున్నాయి. స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో చేర్చారు.మహిళలు, పిల్లలు, హత్య, రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కేంద్రం కఠినతరం చేసింది . కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీ, తీవ్రవాదానికి చెక్ పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు.సాయుధ తిరుగుబాటు, విధ్వంసం, వేర్పాటువాదం.. లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు భంగం కలిగించే యాక్టివిటీస్‌పై సీరియస్ యాక్షన్ తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను చేర్చారు. కొన్ని నేరాలకు జరిమానాలు, శిక్షలను పొడిగించారు. బలవంతపు వసూళ్లు, క్రైమ్ సిండికేట్ కోసం చేసే సైబర్ నేరాలు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కు ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయి..కులం, భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమందిని హత్య చేస్తే.. నిందితులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. నేరానికి సంబంధించి బాధ్యుడిని చేసే వయసును ఎప్పటిలానే ఏడేళ్లకు కొనసాగించారు.. ఓ వర్గంపై దాడుల్లో ఓ వ్యక్తి చనిపోతే అందుకు కారణమైనవారికి జీవితఖైదు లేదా మరణశిక్ష, ఫైన్ పడనుంది.. నేర తీవ్రతను శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం. ఒక వ్యక్తి మరణానికి కారణమైతే రూ.10లక్షల వరకు జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవితఖైదు వేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారు… ఈ చట్టాల యొక్క ముఖ్య అంశాలను హైలైట్ చేస్తూ, చట్టపరమైన నష్టాలను తగ్గించడం, కార్యకలాపాలు మరియు పరిశోధనా పద్ధతులను క్రమబద్ధీకరించడం మరియు కార్పొరేట్ కోసం సమీక్ష మరియు సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది.
previous post