జాతీయ అవార్డుల ప్రకటనలో సూర్య నటించిన జై భీమ్ తమిళ్ మూవీకి చోటు లేకపోవడం తో సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అది ఎంతలా అంటే చివరకు రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని విమర్శలు చేసేంతలా పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా పై సౌత్ మూవీస్ హవా కొనసాగుతుంది. ఇందులో టాలీవుడ్ మూవీలు పై చేయి సాధిస్తున్నాయి. చివరకు టాలీవుడ్ లో ఒక చిన్న హీరో సైతం పాన్ ఇండియా మూవీ తీసి హిట్ కొడుతున్నాడు. ఇది నార్త్ ఇండియన్స్ కి అస్సలు నచ్చడం లేదు. దీనికి తోడు పక్కనే ఉన్న కోలీవుడ్ కూడా తెలుగు సినిమాల హవాతో మండిపడుతుంది. ఇప్పుడు జాతీయ అవార్డుల్లో కూడా టాలీవుడ్ సినిమాలదే పై పై చేయి కావడం కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ పుష్ప మూవీకి, జై భీమ్ మూవీకి కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మండిపడటం విశేషం. అవార్డుల ఎంపికలో రాజకీయం ఉందని ఆయన ప్రధాన ఆరోపణ. బిజెపి నేతలు చివరకు అవార్డులు కూడా సైతం రాజకీయం చేసేసారని ధ్వజమెత్తారు. మరోవైపు మొదటి నుంచి జాతీయస్థాయిలో సినిమాల పరంగా కానీ కలెక్షన్లు విషయంలో కానీ తెలుగు సినిమాలను డామినేట్ చేస్తున్న కోలీవుడ్ ను నేడు తెలుగు సినిమాలు కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలుగు సినిమాలను, హీరోలను అవమానిస్తూ తమిళ్ ఆడియోస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా తెలుగులో రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీలను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ప్రధాన విషయం ఏంటంటే జై భీమ్ సినిమాకు జాతీయ అవార్డు రాలేదనే దానిపై చర్చ జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాకి అన్యాయం జరిగిందని, కనీసం ఒక కేటగిరీలో అయినా సరే జై భీమ్ సినిమాకి తప్పనిసరిగా అవార్డు ఇవ్వాల్సిందని అంటున్నారు.
ఇందులోనే కొందరు తమిళ ఆడియన్స్ తో పాటు కొందరు తెలుగు ప్రేక్షకులు కూడా జై భీమ్ సినిమాకు అవార్డు ఇవ్వకుండా పుష్ప సినిమాకు అవార్డు ఇచ్చారని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్, ఉత్తమ సంగీతం దర్శకుడు కేటగిరీలో దేవి ప్రసాద్ కు అవార్డులు వచ్చాయి. అయితే ఇక్కడ పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు అవార్డు రావడం పై కొందరు విషం చిమ్ముతున్నారు. జై భీమ్ సినిమాకు అవార్డు రాలేదనే విషయంలో అందరు బాధపడుతున్నారు. అది చాలా మంచి సినిమా ఒటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి సంచలనాలు సృష్టించింది. ఆ సినిమాకు అవార్డు ఎందుకు రాలేదనే విషయంలో గట్టిగా నిలదీసిన అడిగినా తప్పులేదు. కానీ పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కి ఎందుకు ఇచ్చారని విమర్శించడం సరైనది కాదు. దశాబ్దాల తర్వాత ఒక తెలుగు హీరోకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు రావడం తెలుగు వారందరూ చాలా గర్వించదగ్గ విషయం. కానీ అల్లు అర్జున్ కి – జై భీమ్ సినిమాకి ముడి పెట్టడం సరికాదన్నది చాలామంది అభిప్రాయం. 2020లో సూరరై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా సూర్య జాతీయ అవార్డు అందుకున్నాడు. ‘జై భీమ్’ కూడా అదే సంస్థ నుంచి వచ్చింది. ఇన్నేళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఏ హీరోకి వరసగా రెండుసార్లు పురస్కారం వరించలేదు. ఈ కారణంతో కూడా సూర్యకు అవార్డు ఇవ్వలేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసిన సినిమా జై భీమ్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ సాధారణ లాయర్ పాత్రలో సూర్య అదరగొట్టేశాడు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు ఏ విభాగంలోనూ అవార్డ్ రాలేదు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలవడం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. దానికి అతడి పూర్తి అర్హుడు. దీనికి సూర్య కూడా పోటీదారుడే కానీ కొద్దిలో మిస్ అయింది. జై భీమ్ మూవీ కి కనీసం ఏదో ఒక కేటగిరిలో ఒక అవార్డు వచ్చి ఉన్న గొడవ జరిగేది కాదు. ఇందులో కూడా రాజకీయాలు చోటు చేసుకోవడంతో జై భీమ్ కు అన్యాయం జరిగిందనేది వాస్తవమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
previous post
next post