సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మథలుగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం లో నారా రోహిత్ 20వ మూవీ ‘సుందరకాండ’ టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ఇదొక పెక్యులర్ లవ్ స్టొరీ. కమ్ బ్యాక్ మూవీ గా ఈ స్క్రిప్ట్ నే లాక్ చేశాం. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్. సంతోష్, గౌతమ్, రాకేశ్ సినిమాని బలంగా నమ్మారు. వెంకీ బ్రిలియంట్ కథ రాశారు. ఈ స్టేజ్ మీద వున్న అందరినీ కథే తీసుకొచ్చింది. టీజర్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. లియాన్ జేమ్స్ మంచి ఆల్బం ఇచ్చాడు. మంచి పాటలు కుదిరాయి. మున్ముందు సినిమా నుంచి మరింత కంటెంట్ రాబోతోందన్నారు. నటుడు డా. నరేష్ వికే మాట్లాడుతూ.. ‘సుందరకాండ’లాంటి లవ్ స్టొరీ తెలుగులో చూడలేదు, నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి లవ్ స్టొరీ ఎవరూ ఊహించలేరు. ఈ టీజర్ చాలా ప్లజెంట్ గా వుంది. ఇది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్. రోహిత్ తప్పా ఈ క్యారెక్టర్ లో ఎవరినీ ఊహించలేను. సినిమా విందు భోజనంలా వుంటుందన్నారు నటి శ్రీదేవి మాట్లాడుతూ… అందరినీ మళ్ళీ కలవడం చాలా ఆనందంగా వుంది. టీజర్ ని చూసినప్పుడు ఈశ్వర్ టైం గుర్తొచ్చింది. ఇది చాలా మంచి కలర్ ఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్’ అన్నారు
నిర్మాత సంతోష్ చిన్నపొల్ల ,డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి..
హీరోయిన్ వృత్తి వాఘని , నటి వాసుకి , నటుడు అభినవ్ గోమఠం, సహ నిర్మాతలు రాకేష్ మహంకాళి , గౌతమ్ రెడ్డి.. తదితరులు మాట్లాడారు.