డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన సరిపోదా శనివారం ఆగస్టు 29 న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానున్న క్రమంలో ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సరిమప.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది.
ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ వుంది. త్వరలో తెలుస్తుంది మీకు. సినిమా గురించి చాలా చెప్పేశాను. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ట్రైలర్ లో చిన్నగా అరిశాను. ఈనెల 29న అందరూ అంతరేంజ్ లో సక్సెస్ ఇవ్వాలి. వివేక్ ఏమి తీశాడో 29న మీకే తెలుస్తుంది. వివేక్ శివతాండవం ఈ సినిమాలో చూపించాడు. ఇది వివేక్ కు మైల్ స్టోన్ లా వుంటుంది. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. జేక్స్ నా ఫ్యాన్. టెన్షన్ వున్నప్పుడు జేక్స్ ఆర్.ఆర్. ఇంటే రిలీఫ్ గా వుంది. సినిమాటో గ్రాఫర్ మురళీ గారు చాలా కేర్ తీసుకుని టేక్ ఎన్ని అయినా కాంప్రమైజ్ కాలేదు. ఇక ఎడిటింగ్ చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో సోకుల పాలెం సెట్ అనేది రియల్ లొకేషన్ లా ఆర్ట్ డైరెక్టర్ చేశాడు. మా నిర్మాత దానయ్యగారు ఏ సినిమాకూ కథ తెలీయదు. లొకేషన్ కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ ఆయనకు అదృష్టం వుంది. అందుకే సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. వివేక్ తో పనిచేయాలంటే టీమ్ చాలా కష్టపడాలి. ఈ సినిమా సక్సెస్ లో అందరికి భాగం వుంది. ఎగ్జిబిబటర్లు, పంపిణీదారులకు చెప్పాలంటే, కలిసివస్తే కాలం వస్తే నడిచివచ్చే సినిమా వస్తుందంటారు.. అలాంటి సినిమా సరిపోదా శనివారం అన్నారు.. చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ అంటే సుందరానికి రిలీజ్ రోజున కన్ ఫ్యూజ్ గా వున్నా. ఎదుకంటే కొందరు బాగుందని, మరికొందరు బాగోలేదని టాక్ వచ్చింది. దాంతో ఏ తరహా సినిమా చేయాలో అర్థం కాలేదు. నాని నాకు ఛాన్స్ ఇచ్చారు. అందుకే థ్యాంక్స్ చెబితే సరిపోదు అనుకుని ఆయనకు నాపై వున్న నమ్మకానికి సరిపోదా శనివారం సినిమా ఇచ్చా. అలాగే ఇతర నటీనటులు కూడా బాగా కుదిరారు. అందరూ రైటింగ్ బాగుందని అంటున్నారు. అది వీరి పెర్ ఫార్మెన్స్ తో ముందుకు సాగాను. ఎస్.జె. సూర్యకి ఏదైనా సీన్ చెప్పాలంటే భయమేస్తుంది. అయినా నేను చెప్పింది విని అంగీకరించారు అన్నారు.
చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ, సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ అవుతుంది. నానిగారు కథల ఎంపికలో బెస్ట్. కథ నచ్చితే కొత్త దర్శకుడయినా అవకాశం ఇస్తారు. నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు నాని. అదేవిధంగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. నాని ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలి. ఇక ఎస్.జె. సూర్య నటనలో ఇరగదీశారనే చెప్పాలి. నా తర్వాత సినిమాలో కూడా ఆయనే చేయాలని కోరుకుంటున్నా. ప్రియాంక అద్భుతంగా నటించారు. అభిరామిగారు ఈ సినిమాలో తల్లిగా చేశారు. దర్శకుడు ఏడాదిపాటు కథ రాశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. వివేక్ సినిమా అంటే అంటే సుందరానికి లాంటిది తీస్తాడేమోనని అనుకున్నాను. కానీ మంచి సినిమా తీశాడు. పెద్ద దర్శకుడు కోవలో చేరతారు. సంగీతం దర్శకుడు జేక్స్ బిజోయ్ రీరికార్డింగ్ బాగా చేశాడు. ఈ సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్ లో కలుద్దామని అన్నారు
నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య మాట్లాడుతూ వివేక్ ఆత్రేయ రచన భిన్నమైంది. ఆయన చెన్నై కి వచ్చి నాకు కథ చెప్పారు. ఆయన నెరేషన్ విన్నాక చాలా ఆనందం కలిగింది. ఇటువంటి రచయితలను అరుదుగా చూస్తుంటాం. ఒకరకమైన యాక్షన్ సినిమాను విభిన్నంగా వివేక్ మలిచారు. అన్ని యాక్షన్ సినిమాలు మాణిక్ బాషా కాన్సెప్ట్ లోనే వుంటాయి. ఈవెన్ బాహుబలి 2, ఇంద్ర కూడా మానిక్ బాషా కాన్సెప్ట్ వుంది. అలాంటి తరహా సినిమాలకు కొత్త తరహా యాక్షన్ వివేక్ తీసుకువచ్చారు. విషయం ఏమంటే… సినిమాలో నాని తల్లి కొడుకును ఏంగ్రీ వుండకూడదు అని ప్రామిస్ తీసుకుంటుంది. అందుకే శనివారం అని ఫిక్స్ చేశారు. మిగిలిన రోజుల్లో మానిక్ గా వుండే నాని శనివారం బాషా గా మారతాడు. ఇటువంటి కాన్సెప్ట్ మరీ మరీ చూసేవిధంగా వుంటుంది.
ఇక కానిస్టేబుల్ గా ప్రియాంక అందంతోపాటు నటనను కనబరిచారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా అన్ని శనివారం నాడు కొన్ని మ్యాజిక్ లు జరిగాయి. నాది, నాని, సాయికుమార్ లతోపాటు అందరి పుట్టినరోజులు శనివారమే వచ్చాయి. ఇక డివివి బేనర్ ఫెంటాస్టిక్ కంపెనీ. నాని చాలా మంచి మనిషి, నటుడు. విజన్ వున్న నటుడు. సినిమాలపై తపన వుంది. అసిస్టెంట్ దర్శకుడినుంచి ఈ స్థాయికి చేరారంటే ఆయన కష్టమే ఫలించింది. నేను ఇందులో డబ్బింగ్ ఫర్ఫెక్ట్ గా చెప్పాను. వివేక్ గారు చాలా ట్రిక్కీగా పాత్రలను డిజైన్ చేశాడు. అలా నా పాత్ర దయాను మలిచారు.
కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ , సంగీత దర్శకుడు జేమ్స్.
దర్శకులు శైలేష్ కొలను , ప్రశాంత్ వర్మ , దేవకట్టా , శౌర్యవ్ నటుడు అలీ , నిర్మాత చెరుకూరి సుధాకర్
నటి మణులు అతిధి , అనితా చౌదరి
అభిరామి తదితరులు మాట్లాడారు.
previous post