సంక్రాంతి సినిమా అంటే తెలుగోళ్ళకి ఎక్కడలేని ఆనందం పెద్ద హీరోలతో పోటీ ఎంతుంటే అంత కిక్. గత సంవత్సరం ఉస్సూరనిపించిన సంక్రాంతి సినిమా ఈ ఏడాది మాత్రం దిమాక్ ఖరాబ్ చేయనుందన్నది పబ్లిక్ పల్స్. ఒకప్పుడు సంక్రాంతి హీరోలుగా బరిలోకి దిగి హోరాహోరీ తలపడిన పందెం కోళ్ళు ఇప్పుడు తమ ‘వీర’త్వాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు అయితే ఈ ఏడాది పోటీ మరింత ఆరోగ్యకరంగా చేసింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్.. తెలుగు సినిమా రంగంలో అగ్రగామి నిర్మాణ సంస్థగా ఆల్మోస్ట్ అందరి హీరోలతో చిత్రాలు నిర్మిస్తూ వెండితెరపై తిరుగులేని చెరగని సంతకం చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంక్రాంతి చిత్రాలతో డిస్ట్రిబ్యుటర్ రంగంలోకి అడుగుపెడుతూ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నో సంక్రాంతులను చూసిన టాలీవుడ్ పోటీ పడ్డ రెండు చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ నుంచి రావడం మాత్రం చూడలేదు.ఈ సంక్రాంతికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నరసింహం బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను మైత్రి సంస్థ నిర్మించడం విశేషంగాగా ఈ రెండు చిత్రాలలోనూ వీరిద్దరి సమకాలిన నటుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా నటించడం మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్. ఇంత వరకు అగ్ర కథానాయకులు, యువ కథానాయకులతో సినిమాలు నిర్మించిన మైత్రి సంస్థర ఆంధ్రా, తెలంగాణలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ రెండు సినిమాలను సొంతంగా విడుదల చేయనుంది. రెండు చిత్రాలకు మంచి పాజిటివ్ బజ్ ఉండడంతో కలెక్షన్ వర్షం కురవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు టాక్. ఈ రెండు చిత్రాలతో పాటు విజయ్ నటించిన ‘వారసుడు’ అజిత్ నటించిన తెగింపు చిత్రాలు విడుదల కానున్నప్పటికీ వాటిపై తెలుగు ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ మాత్రం చూపించట్లేదు వారసుడు చిత్రం ఎక్కువ ధియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రేస్ జరిగేది బాలయ్య చిరు ల మధ్య అన్నది సుస్పష్టం. ‘వాల్తేరు వీరయ్య’ దాదాపు 170 కోట్లు, ‘వీరసింహారెడ్డి’ 110 కోట్లు బడ్జెట్ తో రూపుదిద్దుకున్నాట్లు తెలిసింది ఈ రెండు చిత్రాల కలెక్షన్లు దాదాపు 300 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూషన్ రంగంలో సైతం మైత్రి మూవీ మేకర్స్ తమదైన మార్క్ చూపించబోతున్నారని సినీ విశ్లేషకుల మాట. ఇదే నిజమైతే భారీ చిత్రాలు నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రి తదుపరి విడుదల కానున్న చిత్రాలన్ని సొంతంగానే విడుదల చేయనున్నారని ఫిలిం నగర్ న్యూస్.