పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేస్తూ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సినిమా ప్రేమికులను తీవ్ర నిరాశ కు గురిచేసింది.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఈ సమ్మర్ ను టాలీవుడ్ డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా చిత్రాలే ధియేటర్లని పలకరించాయి.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కాకపోవడం, ఎన్నికలు, ఐపీల్ మ్యాచ్ లు, ఇలా ఎన్నో కారణాలు ప్రేక్షకుడిని థియేటర్స్ కి తీసుకురాలేకపోయాయి.. సగం రివ్యూ లతో సినిమాను చంపేసిన మీడియా ఇప్పుడు సానుభూతి వచనాలు పలుకుతోంది.. తెలంగాణ లో సుమారు 800 సింగిల్ స్క్రీన్ లు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 1200 కు పైగా ధియేటర్ లు ఉన్నాయి.. తెలంగాణ తీసుకున్న నిర్ణయమే ఆంధ్రా కూడా కొనసాగిస్తే 2000పైగా ధియేటర్లు మూతపడనున్నాయి.. చిన్న సినిమాలకు కలక్షన్స్ లేకపోవడం పది, పదిహేనుమంది తో షో లు రన్ చేస్తే పవర్ బిల్, టాక్లు జీతభత్యాలు ఇతర ఖర్చులు తట్టుకోలేమని అందుకే ఈ నిర్ణయమని ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు.. పెద్ద హీరోలు సినిమా లు తగ్గించుకోవడం, సోషల్ మీడియా విస్తరించడం, పబ్లిసిటీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం సినిమా ను ఆడియన్స్ కి దూరం చేసేసాయి..
కౌంట్ లో దుమ్మురేపుతున్న తెలుగుసినిమా కంటెంట్ చూపడం లో పూర్తిగా విఫలం అవుతుంది.. మిగిలిన సౌత్ లాంగ్వేజ్ లలో చిన్న సినిమాలు కూడా బాక్సఫీస్ ని షేక్ చేస్తుంటే ఇక్కడ సింగిల్ షో కె పరిమితమై పోతున్నాయి.. పెద్ద బ్యానర్లు తీస్తున్న చిన్న సినిమాలు అడపాదడపా హిట్ అవుతున్న వాటికి కూడా పెద్ద సినిమాలస్థాయి లొనే పబ్లిసిటీ కి ఖర్చు చేయాల్సొస్తుంది.. దానికి తోడు రివ్యూవర్లను కూడా మానేజ్ చేయక్కపోతే మంచి కంటెంట్ కూడా మసిపోయేంత దుర్భర పరిస్థితి ని మేకర్స్ తీసుకొచ్చారు. ఇంట్లో సినిమా చూడ్డానికి అలవాటు పడ్డ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు మేకర్స్ మంచి కంటెంట్ ని ఎన్నుకోవాల్సిందే. లేకపోతే ధియేటర్లు కనుమరుగు కావడం ఖాయం.. బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ స్మాల్ స్క్రీన్ కే పరిమితమై పోతుంది.
previous post
next post