సీనియర్ హీరో మోహన్ బాబు కు ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. అటు రాజకీయంగా కానీ ఇటు సినిమా పరంగా కానీ కష్టాలు, నష్టాలు తప్ప అనుకూలించే అంశాలు అయితే మాత్రం ఏవీ కనిపించడం లేదు. మోహన్ బాబు గత చివరి సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అతని వారసుల సినిమాలు కూడా వచ్చినట్టే వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి తప్ప ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. కానీ ఎవరు ఊహించని విధంగా వంద కోట్లతో సినిమా చేస్తున్నట్లు మోహన్ బాబు ప్రకటించడమే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వద్ద కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్ద విషయం. మోహన్ బాబు కుటుంబం తీసిన చిన్న సినిమాలకే థియేటర్లలో టిక్కెట్లు తెగని పరిస్థితి ఉంది. వంద కోట్ల సినిమా అంటూ ప్రకటన చేయడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచింది. తిరుమలలో శ్రీవారిని దర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో వంద కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను విష్ణు మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తారని స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో నటించేందుకు మంచు ఫ్యామిలీకి నందమూరి బాలకృష్ణ తన అంగీకరాన్ని కూడా తెలియజేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తీసిన ఒక మూవీలో బాలకృష్ణ అతిధి పాత్రలో నటించారు. మరోసారి మంచు ఫ్యామిలీ తీసే సినిమాలో బాలకృష్ణ నటించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తుంది. మోహన్ బాబు రావణబ్రహ్మ లేదా భక్తకన్నప్ప సినిమాలు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆ రెండు సినిమాలు తన డ్రీమ్ ప్రాజెక్టులను చాలా సందర్భంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. నెట్టింటి ప్రచారం జరుగుతున్న దాన్నిబట్టి చూస్తే రావణబ్రహ్మ సినిమా చేసే అవకాశాలున్నట్లు స్పష్టమవుతుంది. రావణబ్రహ్మగా ప్రధాన పాత్రలో మోహన్ బాబు నటించిన అవకాశం ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ శ్రీరాముని క్యారెక్టర్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మంచు విష్ణు వంద కోట్ల బడ్జెట్ మూవీపై చెప్పే వివరాలను బట్టి మరింత స్పష్టత వచ్చే అవకాశం.
previous post