Vaisaakhi – Pakka Infotainment

మిస్ ఫైర్ ఏజెంట్

గ్రాండ్ గా రిలీజ్ అయిన అఖిల్ ఏజెంట్ మూవీ సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది. తెర మీద భారీ ఖర్చు కనిపిస్తున్నప్పటికీ అర్థం పర్థం లేని సినిమాగా మిగిలిపోయింది. అజిత్ సినిమా విశ్వాసం, షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీలను మిక్సి లో వేసి తీసినట్టుందని ఈ రెండు చిత్రాలను చూస్తే ఇక ఏజెంట్ సినిమా చూడనవసరం లేదని పోనీ అంతకుమించి ఈ మూవీని తీసారంటే అది కూడా లేదని ఒక ప్రేక్షకుడు కమెంట్ చేస్తే 80కోట్లు ఖర్చుపెట్టి కొత్త కొత్త గన్స్ ఎలా కాల్చాలో చెప్పినట్టుందని మరో ప్రేక్షకుడు వ్యాఖ్యానించాడు. కధ, స్క్రీన్ ప్లే సరిగా, రొడ్డ కొట్టుడు యాక్షన్ సన్నివేశాలు, ఆకట్టుకొని పాటలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించ లేకపోయాయన్న వ్యాఖ్యలు అందరినోట వినిపిస్తున్నాయి. నిజానికి ఏజెంట్ కంటే అడవి శేషు చేసిన స్పై, యాక్షన్, త్రిల్లర్ సినిమాలు ఎంతో బెటర్ గా కనిపిస్తున్నాయి. ఏజెంట్ మూవీలో దర్శకుడు సురేంద్ర రెడ్డి మార్క్ పూర్తిగా మిస్ అయిందని చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు అసలు హీరో అఖిల్ లేక మమ్ముటి అనే సందేహం కూడా వస్తుంది. సినిమా ఈ మాత్రం అయినా కొంచెం చూడొచ్చు అంటే దానికి కారణం సీనియర్ హీరో మమ్ముటి అని చెప్పక తప్పదు. అయితే అఖిల్ క్యారెక్టర్ పరంగా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గత చిత్రాలు కంటే చాలా బెటర్ గా చేసాడు. కథల ఎంపికలో మొదటి నుంచి తప్పులో కాలేస్తున్న అఖిల్ ఈసారి కూడా అదే తప్పు చేసాడు. పెద్ద బ్యానర్ పెద్ద డైరెక్టర్ అనే నమ్మకంతో గుడ్డిగా కథ ఒప్పుకొని సినిమా చేసేసాడు. సినిమాపై ఎంతో హోప్ పెట్టుకున్న అఖిల్ కు ఈ సినిమా బాగా డామేజ్ చేసిందని చెప్పాలి. సామాన్య ప్రేక్షకుల మాట అటుంచి అక్కినేని వీరాభిమానులకే ఈ సినిమా నచ్చలేదంటే అర్థం చేసుకోవచ్చు. చాలామంది సినిమా చూసిన వాళ్ళు ఫస్ట్ హఫ్ కంటే సెకండ్ హప్ కొంచెం బెటర్ అని చెబుతున్నారు. కానీ థియేటర్లో మాత్రం ఫస్ట్ హఫ్ కి విజల్స్, చప్పట్లు పడుతున్నాయి. సెకండాఫ్ రొడ్డ కొట్టుడు యాక్షన్ సీన్లు తప్ప అసలు కథ లేకపోవడం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారింది. సమయం సందర్భం లేకుండా మధ్యలో అర్థం పర్థం లేని పాటలు వచ్చి సినిమా ఫీల్ ను మరింత చెడగొట్టింది. రిలీజ్ మొదటి రోజే కాదు మొదటి షోకే సినిమాపై ఉన్న అంచనాలు తలకిందులయ్యాయి. మరోసారి అఖిల్ కథల ఎంపికలో జాగ్రత్త తీసుకోకుంటే మళ్లీ ఇటువంటి భారీ డిజాస్టర్ పడక తప్పదని అక్కినేని అభిమానులే చెబుతున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More