కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ని డిఫరెంట్ లుక్స్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్‌లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ముఖ్యమైన షెడ్యూల్‌లో, టీమ్ టాకీ పార్ట్, ప్రముఖ తారాగణంతో కూడిన యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ చేతిలో తుపాకీతో కాకినాడ ఓడరేవులో క్రూయిజ్ షిప్ ముందు నిలబడి కనిపించారు.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
previous post