Vaisaakhi – Pakka Infotainment

బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను..

హీరోయిన్ మాల్వి మల్హోత్రా

బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకి హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయన చాలా సరదా వుంటారు. ఆయన గత చిత్రం భగవంత్ కేసరి ని చాలా ఎంజాయ్ చేశానని నూతన నటి మాల్వి మల్హోత్రా అన్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మాణం లో ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడరసామీ’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్న మాల్వి మల్హోత్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
బాలకృష్ణ గారి సినిమాలు మాగ్జిమం అన్నీ చూస్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకి హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.. భగవంత్ కేసరి సినిమా ని చాలా ఎంజాయ్ చేశాను.
బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఫిల్టర్ వుండదు. ఆయన మనసులో వున్నది వున్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలానే వుంటుంది. నా క్యారెక్టర్ విమన్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతని నేర్పించేలా వుంటుంది. చాలా ఎనర్జిటిక్ హైపర్ యాక్టివ్ అమ్మాయిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ కారణంగానే కథ అంతా జరుగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వుంటాయి, అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. అది బాలకృష్ణ గారికి రిలేట్ అయ్యేలా వుంటుంది.

తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ఎమోషన్స్, యాక్షన్, డ్రామా, రోమాన్స్, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ గారికి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారే క్యారెక్టర్. ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్నీ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. తెలుగు లో బొమ్మరిల్లు, ఏం మాయ చేశావో..నా ఫేవరేట్ ఫిలిమ్స్. రీసెంట్ గా బేబీ సినిమా చూశాను. రాజమౌళి గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల. అలాగే మణిరత్నం సార్ తో కూడా కలసి పని చేయాలని వుంది. ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా యాక్టర్ కళ్ళలో డెప్త్ గురించి మాట్లాడుకుంటే .. నాని గారి పేరు చెప్తాను. తన కళ్ళతో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ పలికించే యాక్టర్ తను. తనతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే మహేష్ బాబు గారు, అడివి శేష్ గారు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది మాల్వీ మల్హోత్రా..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More