యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాణం లో అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించిన ‘లవ్ మీ..ఇఫ్ యు డేర్’ ట్రైలర్‌ను విడుదల చేసారు.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశాను. మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్. యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారన్నారుదర్శకుడు అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. సీతమ్మ, సతీదేవీ ఇలా అందరూ చనిపోయి దేవతలు అయ్యారు. దివ్యవతి చనిపోయి దెయ్యం ఎందుకు అయింది అంటూ అర్జున్ చేసే ప్రయాణమే ఈ చిత్రం. యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స్ కావాలి. మనిషిని ప్రేమించాలంటేనే ఎంతో ధైర్యం,గట్స్ఉండాలి.. అలాంటిది దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్ ఉండాలి. ఈ పాత్రను ఆశించే ఎంతో ఇష్టంగా పోషించారు. గంగాదేవీ లాంటి పాత్రను వైష్ణవి పోషించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమే నడుస్తోంది. వై? అనే క్వశ్చన్స్ లేకుండా వావ్ అని సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారన్నారు.వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ఇదొక డార్క్ లవ్ స్టోరీ. షాకింగ్ ఎలిమెంట్స్, ప్రేమ, రొమాన్స్, థ్రిల్స్ ఇలా అన్ని అంశాలుంటాయి. పీసీ శ్రీరామ్ గారి విజువల్స్, కీరవాణి గారి మ్యూజిక్, అవినాష్ గారి అద్భుతమైన సెట్స్ అన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ మూవీలో డిఫరెంట్‌గా, టఫ్‌గా ఉండే కారెక్టర్‌ను పోషించాను. లోలోపలే బాధపడుతుండే పాత్రను చేశాను. ఆశిష్ కారెక్టర్ ఎంతో మొండిగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు చాలా మంచి డైలాగ్స్ రాశారు. నాపై నమ్మకంతో నాకు పాత్రను ఇచ్చిన దిల్ రాజు గారికి, హర్షిత్, హన్షితకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.హీరో ఆశిష్ మాట్లాడుతూ టీజర్, ట్రైలర్ బాగుంటే సినిమాను చూస్తారు. కథ బాగుంటే ఆడియెన్స్ మూవీస్ చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకు కళ వస్తుంది. సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.సిమ్రన్ చౌదరి, రవికృష్ణ లు కూడా మాట్లాడారు.
next post