ప్రభాస్ కల్కి 2898AD (KALKI) సినిమా కోసం అభిమానులు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్ తో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి సినిమా జూన్ 27 రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. ఓ పక్క కల్కి వెహికల్ ని దేశంలోని ప్రముఖ నగరాలూ తిప్పుతున్నారు. మరో పక్క సినిమా నుంచి కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, ట్రైలర్ రిలీజ్ చేయగా నిన్న కల్కి సినిమా నుంచి భైరవ అంటూ పంజాబీ స్టైల్ లో ఉండే ఓ పాటని విడుదల చేసారు. అయితే నిన్న కేవలం ఆడియో సాంగ్ మాత్రమే రిలీజ్ చేయగా తాజాగా కల్కి భైరవ ఏంథం వీడియో విజువల్స్ తో సాంగ్ రిలీజ్ చేసారు. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకత్వంలో పంజాబీ సింగర్ దిల్జీత్ దోసంజ్ తో ఈ పాటను పాడించారు. ఈ వీడియోలో దిల్జీత్ దోసంజ్ తో పాటు ప్రభాస్ కూడా స్టైలిష్ గా కనిపించి అలరించాడు. ప్రస్తుతం ప్రభాస్ విజువల్స్ తో వచ్చిన ఈ భైరవ ఏంథం వైరల్ గా మారింది.
కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా స్టార్ నటీనటులు చాలా మంది ఈ సినిమాలో నటిస్తుండగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.