ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కమల్ హాసన్ , వంటి అతిరధ మహారధులు నటించిన కల్కి 2898 AD బాక్స్ ఆఫీసు రికార్డులను తిరగరాసిన ఓటీటీ విడుదలకు రాబోతుంది. మే 9 న ధియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆగస్టు 23, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళం, మలయాళం కన్నడ భాషలలో చూడవచ్చు. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. నాగ్ అస్విన్ దర్శకత్వం వహించిన, కల్కి 2898 AD మహాభారతం నుండి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆరు వేల సంవత్సరాల తర్వాత తెరుచుకునే డిస్టోపియన్ భవిష్యత్తులో చిత్రకథ జరుగుతుంది. క్రీ.శ. 2898లో తనను తాను దేవుడిగా చెప్పుకునే సుప్రీమ్ యాస్కిన్ నేతృత్వంలోని నిరంకుశ పాలనలో కాశీ భూమి యొక్క చివరి నగరం కావడం. అక్కడి వారు యాస్కిన్ బానిసలుగా దుర్భరమైన జీవితం గడుపుతూ అసమానతలతో పోరాడుతు భగవంతుని పదవ అవతారమైన కల్కి రాక కోసం ఎదురు చూస్తూ వుంటారు హిందూ పురాణాలు ,ఆధునిక సైన్స్ ఫిక్షన్ కలయికతో జరిగే ఈ కథ గ్లోబల్ ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకుంది. దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రంలో దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, శాశ్వత ఛటర్జీ, బ్రహ్మానందం పశుపతి, అన్నా బెన్ తదితరులతో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, SS రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి ఇతర ప్రముఖులు అతిథి పాత్రల్లో మెరిశారు. చిట్టి పాత్రకు కీర్తి సురేష్ తన గాత్రాన్ని ఇవ్వడం విశేషం. నాలుగు వారాలు తిరక్కుండానే ఓటీటీ ఫ్లాట్ ఫాం లలో సినిమా దర్శనమిస్తున్న తరుణం లో దాదాపు మూడు నెలల తరువాత కల్కి స్ట్రీమింగ్ కాబోతోంది.
previous post