విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రతిభ కనపరిచిన నటి నటులకు సాంకేతిక నిపుణులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2023, అవార్డుల ప్రదానం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. “కళావేదిక” (R.V.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి మోహన్ కృష్ణ , నందమూరి మోహన రూప , మురళి మోహన్ , తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కే. ఎల్. దామోదర్ ప్రసాద్ , కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్ , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఇందిరా గాంధీ ని ఎదుర్కొని నిలబడ్డ ఏకైక మగాడు ఎన్టీఆర్
నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. ఆయన పేరిట నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ : ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిత్రరంగమైన రాజకీయరంగమైన సంచలనానికి మారుపేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ఘనవిజయాన్ని సాధించారు. పేదల కోసం అదేవిధంగా ఆడవారి హక్కుల కోసం పోరాడి వారి హక్కులను వారికి అందించారు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం గా భావిస్తున్నానన్నారు..
ఉత్తమ నటుడు గా ఆనంద్ దేవరకొండ
ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంత్ కేసరి చిత్రానికి సాహు గారపాటి, ఉత్తమ విలన్ గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్ ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలను అందుకున్నారు.
అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్ , బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి , బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రఘుకుంచె , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్ గా శరణ్య ప్రదీప్ , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్ , బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ , బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర , బెస్ట్ ఆర్ డైరెక్టర్ గా నాగేంద్ర , బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి , బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్ , బెస్ట్ ఫిమేల్ సింగర్ గా మంగ్లీ , బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి, బెస్ట్ డెబ్యు మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్ , బెస్ట్ డెబ్యు సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల , బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్ లో సాహితీ దాసరి , స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ , బెస్ట్ డెబ్యూ రైటర్ గా అజ్జు మహకాళి , బెస్ట్ రివ్యూ కమిటీ లక్ష్మణ్ టేకుమూడి , స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ని అతిథుల చేతులమీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి ,నందమూరి మోహన్ రూప కళావేదిక అధినేత భువనరమణమూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు.