కాల భైరవ.. భారతదేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు ..’ పాటను పాడి ఆస్కార్ వేదికను ఓ ఊపు ఊపారు. ఆయన ఓ వైపు సింగర్‌గా, మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆ క్రేజీ సినిమాయే ‘యుఫోరియా’. గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కు తున్న ‘యుఫోరియా’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా కాలభైరవ తన టీమ్‌తో జాయిన్ అవుతున్నారంటూ ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. ఈసినిమాలో నటించబోయే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని టీమ్ తెలియజేసింది.