Vaisaakhi – Pakka Infotainment

సత్యభామనా సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. కాజల్ అగర్వాల్

సత్యభామ నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్లే ప్రయత్నం అని నటి కాజల్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు.. సత్యభామ చిత్ర ప్రమోషన్ లో భాగంగా జరిగిన ప్రెస్మీట్ లో ఎన్నో విషయాలు పంచుకున్నారు. యాక్టింగ్ నా ప్యాషన్ అందుకే పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిన తర్వాత కూడా మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నా కెరీర్ లో కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్, మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది కొత్తగా అనిపించింది అందుకే సినిమా చేసేందుకు ముందుకొచ్చా. ఇలాంటి కథల్లో, క్యారెక్టర్స్ లో నటించాలి అనేది మైండ్ లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్ అయినా చేస్తాను. “సత్యభామ” కంటే ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం ఆఫర్స్ చాలా వచ్చాయి. అయితే నేను ఆ మూవీస్ చేసేంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నా. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉంది అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకుంటా. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో యాక్షన్, భారీ స్టంట్స్ చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. ” ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. వాటిని కథలో ఇన్పుట్ చేశామని అన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More