కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క”.ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో లేబుల్ ‘సారెగమ’ సొంతం చేసుకుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న సినిమా ఆడియో మ్యూజిక్ ఫీస్ట్ లా ఉండబోతోందని మేకర్స్ చెప్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
previous post