ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగం 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అసలే కలియుగం ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు… అనే అంశాలతో… ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది, తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగులో హీరో నాని తో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన ప్రాత్రాల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ…”ఈ మూవీ లో కంటెంట్ చాలా ముఖ్యమైనదని , ఫ్యూచర్ పీరియాడిక్ మూవీ గా రూపొందిందిన ఈ మూవీ ఇప్పటి జెనరేషన్ కి చాలా అవసరమని , ఇది యువత ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని , ఈ మూవీని అందరూ చూసి , మా ఈ క్రొత్త ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నామని అలాగే , ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని” తెలిపారు.
previous post