దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించగా సుహాస్ హీరోగా నటించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఫైనల్ వెర్షన్‌ని చూసిన సుహాస్, యుఎస్‌ఏ హక్కులను సొంతం చేసుకున్నారు.
”ఫైనల్ వెర్షన్ చూసిన తరవాత. బాగా నచ్చడం తో యుఎస్‌ఏ హక్కులను తీసుకున్నానని సుహాస్ చెప్పారు.. ఇది పక్కా ఎంటర్‌టైనింగ్ సినిమా అవుతుందని ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారని దిల్‌రాజు గారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం” అని అన్నారు.
previous post