ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో ప్రత్యేక ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి గడువు తేదీలను సభ్యులకు వివరించారు నిర్మించిన సినిమాల నిర్మాణ వ్యయం, రాబడికి సంబంధించిన అకౌంటింగ్ కలెక్షన్ అడ్మిషన్ మొదలైన వాటికి సంబంధించి చిత్ర నిర్మాతలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను వఆదాయపు పన్ను రిటర్నుల ను గురించి ఈ కార్యక్రమంలో విశదీకరించారు.
అలాగే సవరించిన ఫారమ్ నం.52A వివరాలు, సంబంధిత గడువు తేదీలను చిత్ర నిర్మాతలకు తెలియచేసారు. అధికారుల వివరణ అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఆదాయపు పన్ను శాఖ ఈ రకమైన ఔట్ రీచ్ ప్రోగ్రాం ను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు, దీనిద్వారా సభ్యులు ఆదాయపు పన్ను చట్టం మరియు ఆదాయపు పన్ను నియమాల యొక్క తాజా నిబంధనల ను వివరముగా తెలుసుకోవడం జరిగినదన్నారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను జాయింట్ కమిషనర్, రేంజ్-6, ఎస్. మూకాంబికేయన్ IRS, ఐటీ శాఖ అధికారులు టీ మురళీధర్ , కె . శ్రీనివాసరావు ఓ .సతీష్, చలన చిత్ర పరిశ్రమ నుంచి దిల్ రాజు, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.