మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘అదిరిందయ్యా చంద్రం’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో జంటగా నటించిన శివాజీ లయ ల హిట్ పెయిర్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మంచి నటిగా వరుస నంది అవార్డులు సాధించి కొన్నాళ్ళు ఇండస్ట్రీ కి దూరమైన లయ, మంచి పాత్రలతో అలరించి మళ్ళీ 90s వెబ్ సిరీస్ తో సక్సెస్ బాట పట్టి ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న శివాజీ జంట గా ఓ చిత్రం ప్రారంభమైంది..
శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం.2 గా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా కి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం.
ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు మరియు దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు.
హిట్ పెయిర్ మళ్ళీ కలవడం తో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో చిత్రానికి సంభందించిన వివరాలు వెలువడనున్నాయి.