ఇంతవరకు మూడడుగుల ముందుకి ఆరడుగులు వెనక్కి వెళుతూ వస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ పట్టాలు ఎక్కడమే కాదు మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ని మోసుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గజదొంగ వీరమల్లు గా నటిస్తున్న ఈ చిత్రం లో పోరాటాల సంఖ్య ఎక్కువగా ఉండడం తో సీన్స్ ని కుదిస్తే ప్రేక్షకులకు కొన్ని అర్ధం కాకపోయే పరిస్థితి ఉంటుందని లెంగ్త్ ఎక్కువ సినిమా కన్నా రెండు భాగాలుగా దీన్ని విడుదల చేయడం కరెక్ట్ అన్న యోచన లో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పీరియాడిక్ చిత్రానికి సంబంధించి విడుదలైన రెండు గ్లిమ్స్ అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి..‘హరి హర వీరమల్లు’ సినిమా కేవలం టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ ని కూడా ఒక రేంజ్ లో ఊపేస్తాదని మూవీ టీం చాలా నమ్మకం తో ఉందట.. రెండు పార్టుల ఇంట్రస్టింగ్ అప్ డేట్ తో పాటు మరో ప్రతిష్టాత్మక విషయం ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఫస్ట్ స్క్రీనింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ,హోం మంత్రి అమిత్ షా ల కోసం ప్రత్యేకంగా వెయ్యబోతున్నారట.. సినిమా రిలీజ్ కి ముందు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలిసి ప్రీమియర్ కి ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీమియర్ ని వాళ్లిద్దరూ చూసి రెండు మాటలు మాట్లాడితే దేశవ్యాప్తంగా సినిమా రీచ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని టాక్.. ఏది ఏమైనా సినిమా ఉంటుందా.. ఉండదా..? అన్న ఊగిసలాటల మధ్య అభిమానులను ఆనందపరిచే రెండు వార్తలు మోసుకొచ్చింది.. నిర్మాతగా ఏ ఎమ్ రత్నానికి అనిల్ కపూర్ తో తీసిన నాయక్ (తెలుగు లో ఒకే ఒక్కడు) తరువాత హిందీ లో అతి పెద్ద సినిమా అవుతుంది.