బ్రిటిష్ కాలం నాటి వజ్రాల గజదొంగ స్టోరీ తో పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు ఆదినుంచి ఒకటీ రెండు కాదు.. సవాలక్ష హంసపాదులేదురయ్యాయి.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ శివార్లలో నిర్మించిన భారీ సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం తో సినిమా మరికాస్త ఆలస్యం అవుతుందని అధికారిక వార్తలు వస్తున్నప్పటికీ వీరమల్లు ఇలావుండదు.. అన్న అనధికారిక వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది.. ఈ ప్రాజెక్ట్ ను కొనసాగించాడనికి దర్శకుడు క్రిష్ కూడా సుముఖంగా లేడని దాదాపుగా తప్పుకున్నట్టేనన్న ప్రచారం జరుగుతోంది. క్రిష్ మరోప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడని సమాచారం.. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా ముక్కుతూ మూల్గుతూ ముందుకు వెళ్తుంది.. పవన్ కళ్యాణ్ వేరే సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చెయ్యడం.. వరుస సినిమాలతో బిజీ అవ్వడం.. వంటి కారణాలతో పాటు స్క్రిప్ట్ లో భారీ మార్పులను కూడా పవన్ సూచించిన నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ వచ్చినప్పటినుండి వీరమల్లు గండాలతోనే కాలం గడిపేస్తున్నాడు.. భారీ వర్షం కారణంగా ఒకసారి ఇప్పుడు అగ్ని ప్రమాదం కారణం గా మరోసారి భారీ సెట్ ధ్వంసం అవ్వడం డైరెక్టర్ క్రిష్ ఏకంగా ప్రాజెక్టు నుంచే బయటకు వచ్చాడని వార్తలు రావడం ఫాన్స్ ని అయోమయంలోకి నెట్టేసాయి.. పవన్ కళ్యాణ్ కన్నా తక్కువ స్టార్డం ఉన్న హీరోలు పాన్ ఇండియా లో తమ సత్తా చాటుతుంటే పవన్ కళ్యాణ్ కు సరైన సినిమా ఇండియా స్థాయిలో పడలేదన్నది వాస్తవం.. వీరమల్లు ఆ కొరత తీరుస్తుందని ఫాన్స్ అంతా ఎదురు చూసిన నేపథ్యంలో అసలు సినిమా ఉంటుందా.. ఉండదా..? అన్న డౌట్ వాళ్ళని అయోమయంలో పడేసింది.. వీరమల్లు పై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు మేకర్స్ నుంచి వచ్చే అప్ డేట్ కన్నా పవర్ స్టార్ నుంచి వచ్చే ప్రకటన కోసమే వెయిట్ చేస్తున్నారు.
previous post