మలయాళ నటుడు టోవినో థామస్ అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్ తో రూపొందించబడిన చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ ”చిలకే.. పువ్వే పువ్వే తామర పువ్వే…” అంటూ సాగే మెలోడీ ను విడుదల చేశారు. డిబు నైనన్ థామస్ ఈ సినిమాను సంగీతం అందించారు. కపిల్ కపిలన్ ఈ సాంగ్ ను పాడగా కృష్ణ కాంత్ ఈ సాంగ్ కు లిరిక్స్ సమకూర్చారు. టోవినో థామస్, కృతి శెట్టి కెమెస్ట్రీ బాగా సెట్ అయ్యింది. పాట విడుదలైన కొద్దిసేపటిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందన లభించింది.. ఐశ్వర్య రాజేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు.