అనేక బ్లాక్ బస్టర్ హిట్‌లను నిర్మించిన వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె. గణేష్ ఇప్పుడు అనీష్ దేవ్ నేతృత్వంలోనిWAM ఇండియాస్ తో కలిసి జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘అఘతియా’ మూవీని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నాతో పాటు యూరోపియన్ నటి మటిల్డా & అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలను పోషించారు.ప్రొడక్షన్ హౌస్‌లు తమ అప్ కమింగ్ “అఘతియా” ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. లీడ్ యాక్టర్స్, వారి ఇంటెన్స్ ఫేస్ లతో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ప్రముఖ హాస్యనటులు యోగి బాబు, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్ & రెడిన్ కింగ్స్లీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రముఖ లిరిక్ రైటర్ పా. విజయ్. దీపక్ కుమార్ పతి సినిమాటోగ్రఫీని, శాన్ లోకేష్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించిన “అఘతియా” ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో కూడిన ఫాంటసీ థ్రిల్లర్. ఈ పాన్-ఇండియా చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. సినిమా కోర్ థీమ్ జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ మధ్య బాండింగ్ చుట్టూ వుంటుంది. ఇందులో రాశి ఖన్నా, మటిల్డా నటించిన ఫాంటసీ సన్నివేశాలు రివర్టింగ్ స్క్రీన్‌ప్లేలో ఉండబోతున్నాయి.ఈ సినిమాలో దాదాపు 90 నిమిషాల పాటు అద్భుతమైన CG విజువల్స్ అలరించబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు పా.విజయ్ మాట్లాడుతూ.. ”అఘతియా హ్యూమన్ ఎమోషన్స్ తో ఫాంటసీని బ్లెండ్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది మ్యాజిక్ గురించి మాత్రమే కాదు, పాత్రల మధ్య బాండింగ్ గురించి, తెలియని ప్రపంచం గుండా వారి జర్నీని ఆవిష్కరించే అద్భుత చిత్రీకరణ. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది’ అన్నారు.
previous post