Vaisaakhi – Pakka Infotainment

ప్రతి సీన్ లో ఒక డివైన్ ఫీలింగ్ వుంటుంది -హీరోయిన్ నివేత థామస్

35 చిన్న కథ కాదు వెరీ రూటెడ్ స్టొరీ. ఇందులో తిరుమల వేంకన్న స్వామి కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ ఇంత రీజినల్ గా రూటెడ్ గా వుండటం నాకు చాలా నచ్చింది. డివైన్ ఫీలింగ్ అన్ని సీన్స్ లో వుంటుంది. ఇన్నోసెంట్ ఫ్యామిలీ స్టొరీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుందని నటి నివేదా థామస్ అన్నారు.. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని డైరెక్టర్. సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్ నివేత థామస్ సినిమా విశేషాలని మీడియా తో పంచుకున్నారు. మదర్ క్యారెక్టర్ పోషించడం పై స్పందిస్తూ..’35-చిన్న కథ కాదు’ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ స్టొరీ. స్టార్ట్ టు ఫినిష్ ఆ వరల్డ్ లో కాంప్రమైజ్ లేకుండా రాసిన స్టొరీ. ఇందులో నివేత థామస్ కాకుండా సరస్వతి పాత్రే కనిపిస్తుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా ఇష్టం. ఇండియన్ సొసైటీలో 22 ఏళ్లకే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని జనరల్ గా అడుగుతారు. నేను హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేయడంలో పెద్ద ప్రాబ్లమ్ లేదు. యాక్టర్ గా అన్ని పాత్రలు చేయాలి. మదర్ గా బాగా చేశాను అనే బదులు సరస్వతి పాత్రని బాగా చేశానని మీరంతా చెబితే సంతోషిస్తాను.. నాకంటూ ఒక ప్యాట్రన్ ని సెట్ చేసుకోవడం నాకు ఇష్టం వుండదు. నివేత ఏ పాత్రనైనా చేయగలదని దర్శకులు నమ్మగలిగితే యాక్టర్ గా అంతకుమించిన ఆనందం మరొకటి వుండదు. ఇందులో సరస్వతి పాత్రకు నాకు ఏజ్ లో పెద్ద తేడా లేదు. సరస్వతి ఏజ్ లో నాకంటే ఏడాది చిన్నది. తనకి చిన్న ఏజ్ లోనే పెళ్లి అవుతుంది. ఆమెకి పిల్లలు ఉన్నప్పటికీ ఆమెలో ఒక చైల్డ్ నేచర్ వుంటుంది. ఇందులో యూత్ లవ్ వుంటుంది. ఇవన్నీ ఎక్స్ ఫ్లోర్ చేయడం నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. మ్యాథ్స్ అనేది చిన్న పార్ట్ మాత్రమే. ఇందులో చాలా మాస్ మూమెంట్స్ క్లాస్ రూమ్ నుంచే వస్తాయి. చాలా నోస్టాల్జియా మూమెంట్స్ వుంటాయి. భార్య భర్త, పిల్లలు, టీచర్ స్టూడెంట్స్ ఇలాంటి బ్యూటీఫుల్ రిలేషన్షిప్స్ గురించి చాలా అందంగా చెప్పడం జరిగింది. ఇది కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ ఇస్తుంది.
తిరుపతి స్లాంగ్ కోసం గట్టిగా ట్యూషన్ జరిగింది. దాదాపు నెల రోజులు వర్క్ షాప్ చేశాం. స్లాంగ్ కోసం కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకమే ప్రిపేర్ చేయడం జరిగింది. సింక్ సౌండ్ కావడంతో ప్రతి వర్డ్ ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను. అలాగే పిల్లలు కూడా చాలా ప్రిపేర్ అయ్యారు. భాగ్యరాజా గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో పిల్లల పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటాయి. ఇందులో పిల్లలందరూ హీరోలే. రానా గారికి ఈ సినిమా కథ ముందునుంచి తెలుసు. సురేష్ ప్రొడక్షన్ తో ఆయన ఈ సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా వుంది. మంచి సినిమాలకి వారి సపోర్ట్ ఎప్పుడూ వుంటుందన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More