Vaisaakhi – Pakka Infotainment

ఏంటీ డాప్పెల్ గ్యాంగర్ (Doppel ganger)..?

బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న మూవీ అమిగోస్. ఈ జనరేషన్ హీరోలలో త్రిపాత్రాభినయం చేసినవారిలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. లవకుశ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత అతని అన్న కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అమిగోస్ మూవీలో మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో ఆయన కనిపించనున్నారని డాప్పెల్ గ్యాంగర్ -1 అంటూ సిద్ధార్థ క్యారెక్టర్ ను పరిచయం చేసింది చిత్ర యూనిట్. తర్వాత మంజునాథ్ – డాప్పెల్ గ్యాంగర్ -2 అంటూ మరో పాత్రను రివీల్ చేయడం జరిగింది. అయితే డాప్పెల్ గ్యాంగర్ అంటే ఏంటో తెలియక చాలామంది గూగుల్ సెర్చ్ మొదలుపెట్టారు. దీంతో మేకర్స్ డాప్పెల్ గ్యాంగర్ అంటే “మనిషిని పోలిన మనుషులు” అని అర్థం అంటూ చెబుతూ ఇప్పుడు మూడో డాప్పెల్ గ్యాంగర్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. ప్రపంచ వ్యాప్తంగా తమను పోలిన వ్యక్తులను సెర్చ్ చేసుకుని వారితో స్నేహాన్ని పెంచుకుని తమలాగే వుండే వాళ్ళు ఎలా ఉంటారో ఒకరికొకరు షేర్ చేసుకునే క్రమమే డాప్పెల్ గ్యాంగర్స్ సామాజిక మాధ్యమాలద్వారా ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లో ఉన్నప్పటికి నిజం చెప్పాలంటే ఇది కొత్త విషయమే.. ఇలాంటి ఎక్స్టయిటింగ్ పాయింట్ తో అమిగోస్ తెర కెక్కడం తో ఎక్కడలేని ఇంట్రస్ట్ క్రియేట్ అయింది.. ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమా తో కళ్యాణ్ రామ్ మరో భారీ హిట్ కొట్టడం ఖాయం గా కనిపిస్తుంది.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో నందమూరి కళ్యాణ్ రామ్ గెలపోటములతో సంబంధం లేకుండా డిఫరెంట్ స్క్రిప్ట్ లతో వరుసగా సినిమాలు చేసుకెళ్తూన్నారు. చాలా ఏళ్ల తర్వాత బింబిసారా మూవీ హిట్ అయి కళ్యాణ్ రామ్ కు మంచి పేరును తీసుకువచ్చింది. ఊహించిన విధంగా కలెక్షన్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా దర్శక నిర్మాతలు కళ్యాణ్ రామ్ తో మూవీలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా డెవిల్ అనే పీరియాడిక్ మూవీలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇది పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ఆ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అమిగోస్ సూపర్ హిట్ మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. బింబిసార తర్వాత అమిగోస్ మూవీ కూడా ఆ స్థాయి హిట్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక డెవిల్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయ డంకా మోగిస్తుందని, కళ్యాణ్ రామ్ కెరీర్ లో వరుసగా మూడు హిట్ లు పడి హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని వినిపిస్తున్న మాట.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More