ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రం ట్రైలర్ నేడు విడుదల చేసారు.
ఇటీవల విడుదలైన ‘రం రం ఈశ్వరం’ పాట లిరికల్ వీడియోకి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనూహ్య స్పందన లభించడంతో చిత్ర నిర్మాత మహేశ్వర రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ట్రైలర్ లంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
ముఖ్య అతిధులుగా హీరో విశ్వక్ సేన్, దర్శకుడు అనిల్ రావిపుడి, సంగీత దర్శకుడు తమన్ హాజరవ్వగా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూస్తే ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలని ఎలివేట్ చేయగా శివేంద్ర విజువల్స్ మరికొన్ని చోట్ల హైలైట్ అయ్యాయి.