మలయాళ నటుడు టోవినో థామస్ ‘అజయంతే రాండమ్ మోషణం’ (ARM) అ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. తాజాగా ట్రైలర్ చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ ని ప్రశంసించారు.. టోవినో థామస్ మూడు డిఫరెంట్ లుక్స్ లో బాగున్నాడని.. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని అన్నారు.
ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ చిలక మార్వలెస్ మెలోడీగా వైరల్ అయింది.. దీనికి డిబు నైనన్ థామస్ సంగీతం అందించగా కపిల్ కపిలన్ గాయకుడు. పాట విడుదలైన కొద్దిసేపటిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమా టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో విడుదల చేయాగా మంచి స్పందన లభించింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ మెకోవర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐశ్వర్య రాజేష్ మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది.