ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ అనే సినిమా తెరకెక్కింది. ఒక్క క్యారెక్టర్ తో హ్యాకింగ్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
రమణ కె సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుకుమార్.పి సంగీతం అందించారు. సాయిరాం తాటిపల్లి ఈ సినిమాకు ఎడిటర్. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
ఆద్య ( కావ్య కీర్తి ) సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది బెంగళూరులో … ఇంట్లో ఒక్కతే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ చేయడం అమ్మతో ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది… ఇంతలో ఆద్య కాలేజీ ఫ్రెండ్ రాహుల్ కాల్ చేస్తాడు.. అప్పటి నుండి ఆద్య కి ప్రాబ్లెమ్ స్టార్ట్ అవుతాయి… ఇంట్లో ఆద్య ఏం చేస్తుందో ఏ డ్రెస్ లో ఉందో అన్ని చెప్పి ఆద్య నీ భయపెడుతూ ఉంటాడు… జాబ్ ప్రాబ్లెమ్ ఫ్రెండ్ కి ప్రాబ్లమ్స్ ఆద్య మదర్ కి ప్రాబ్లెమ్ వోచేలా చేస్తాడు రాహుల్… అసలు రాహుల్ ఎందుకు చేస్తున్నాడు , ఆద్య ఎలా ప్రాబ్లెమ్ నీ సాల్వ్ చేసింది అనేదే కథ
విశ్లేషణ:
హీరోయిన్ కీర్తి పెర్ఫెమెన్స్ సినిమాకి హైలైట్ ఇంట్లో ఒంటరి గా ఉంటే ఎలా ఉంటుందో ఆ భయాన్ని తన నటనలో చూపించింది. సినిమా మొత్తం కావ్య ఒక్కతే ఉంటుంది… ఫస్ట్ టైమ్ టాలీవుడ్ లో సింగిల్ హీరోయిన్ మూవీ హలో బేబీ . ఒక కొత్త ప్రయోగం అనే చెప్పాలి.
ఒక్కటే ఇంట్లో సినిమా మొత్తం తీసి మెప్పించడం అంటే మాములు విషయం కాదు… నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే స్క్రీన్ప్లే తో బాగా చూపించాడు డైరెక్టర్
కెమెరా వర్క్ బాగుంది, మంచి లైటింగ్స్ లో సినిమాను గుడ్ విజువల్స్ తో తెరకెక్కించారు. ఎడిటర్ ఎడిటింగ్ బాగుంది, సినిమాను ఎక్కువ లెన్త్ లేకుండా బాగా కట్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది..
స్క్రీన్ప్లే తో పాటు దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ రత్నం టేకింగ్ సినిమాను ఎక్కడా బోరింగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించింది. ఇలాంటి పాయింట్ తో సినిమా తీసినందుకు డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం ను అలాగే నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ ను అభినందించాలి.
ఒక డిఫరెంట్ కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హలో బేబీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక మంచి సినిమాను అందించిన చిత్ర యూనిట్ కు అభినందనలు. మంచి సినిమాను ప్రేక్షకులు మిస్ అవ్వదు డిఫరెంట్ మూవీ అందరు చూడదగ్గ సినిమా. ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్ తో మరిన్ని సినిమాలు వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారు
రేటింగ్: 3/5
