రస్టిక్ అండ్ రా మూవీగా రూపొంది నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన దసరా మూవీ లోని ‘చంకీలా అంగీలేసి’ అనే పాట ఇప్పుడు రీల్స్ లోనూ ఆ తరహా ఇతర మాధ్యమాలను దుమ్ము రేపుతుంది.. థియేటర్ లలో మిక్స్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బిగ్ బ్రేక్ ఈవెన్ కోసం బరిలోకి దిగి కేవలం మూడురోజుల్లోనే దాన్ని టచ్ చేసిందని సమాచారం. సినిమాలో వచ్చే పాటను జనం అంతంత మాత్రమే మెచ్చుకున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇది పెద్ద హిట్టయి కూర్చుంది. సెలబ్రిటీల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ‘కళ్ళకు అయినాలెట్టి’ అని కాలు కదుపుతున్నారు. రీల్స్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట గత రికార్డులన్నీ చెరిపేస్తూ తెలుగు తమిళ్ లో దూసుకుపోతుంది. కీర్తి సురేష్ అభినయంలో వచ్చిన ఈ పాటను అదే స్టెప్పులతో యువకులు కూడా రీల్స్ చేయడం విశేషం కాగా.. చాలామంది ఇదే పాటకి తమ సొంత కొరియోగ్రఫీని జోడించి రీల్స్ లో అలరిస్తుండగా.. మరి కొంత మంది ఫన్ గా ఈ పాటని ప్రజెంట్ చేస్తున్నారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ఈ పాటను సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ కూతురు ధీ, రామ్ మిర్యాల సంయుక్తంగా అలపించారు. డిఫరెంట్ వాయిస్ తో పాటపడే సింగర్ ధీ వల్లే దీనికి ఇంత క్రేజీ వచ్చిందన్నది ట్రేడ్ పండితుల మాట. కాసర్ల శ్యామ్ సాహిత్యం విభిన్నంగా ఉండటం పాట సక్సెస్ కు ప్లస్ పాయింట్ అయింది. ఇదిలా ఉండగా ట్రెండింగ్ లో ఉన్న ఈ పాటతో పాటు వైఎస్ఆర్ టిడిపి నాయకురాలు వైయస్ షర్మిల మాట్లాడిన ‘పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర’ అన్నది కూడా రీల్స్ లో దసరా పాటకు గట్టి పోటీ ఇవ్వడం విశేషం.