కమిటీ కుర్రాళ్ళు విజయోత్సవ వేడుకలో నిహారిక కొణిదెల
మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు మీడియా తీసుకెళ్లడం వల్లే ఇది పీపుల్స్ సినిమా అయింది. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది’ అని చిత్ర సమర్పకులు నిహారిక కొణిదల అన్నారు. ఆమె సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఆగస్ట్ 9న విడుదలై అద్భుతమైన విజయాన్ని ఆడియెన్స్ అందించడంతో శనివారం నాడు నిర్వహించిన సక్సెస్ మీట్ లో.. నిహారిక మాట్లాడుతూ.. అంకిత్ కొయ్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. కథ వినమని అన్నాడు. కథను వినాలని తీసుకున్నదే ది బెస్ట్ నిర్ణయమని చెప్పారు. నిర్మాత జయ అడపాక మాట్లాడుతూ మంచి కంటెంట్‌తో ముందుకు వస్తే ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ మళ్లీ నిరూపించారు. సినిమాను హిట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. టీంకు కంగ్రాట్స్’ అని అన్నారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. ‘ నాలుగేళ్ల క్రితం ఈ ప్రయాణం మొదలైంది. సక్సెస్ అనే పదం వినడానికి మూడున్నరేళ్లు పట్టింది. కమిటీ కుర్రోళ్లు సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి నిహారిక గారు, పద్మజ గారు.. జయ గారు కారణం. వీళ్లే మా సక్సెస్‌కు కారణం. నిహారిక గారు చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఈ సినిమాను నిర్మించేందుకు చాలా మంది భయపడ్డారు. కానీ నిహారిక గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ మూవీని చూసిన వాళ్లు మలయాళీ చిత్రమని అంటున్నారు. కానీ నిహారిక లాంటి నిర్మాతలు ఉంటే.. ఇలాంటి చిత్రాలు తెలుగులోనే ఇకపై వస్తాయని చెప్పారు. అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు మూడేళ్ల క్రితం మొదలైంది. కథ విన్న వెంటనే నాకు తెలిసిన నిర్మాత వద్దకు తీసుకెళ్లాను. అలా తిరిగి తిరిగి నిహారిక గారి వద్దకు కథ వచ్చింది. ఈ చిత్రం మీద నమ్మకం కంటే భయం ఎక్కువగా ఉండేది. ఒక వేళ ఇది సక్సెస్ కాకపోయి ఉంటే.. ఇలాంటి ప్రయోగం ఇంకెవ్వరూ చేయకపోయేవాళ్లు. కొత్త వాళ్లను పెట్టి తీయాలనుకునే నిర్మాతలు భయపడేవాళ్లు. సినిమాలో నటించిన ఈ కొత్త వాళ్లందరికీ అడగక ముందే పేమెంట్లు వచ్చాయి. ఇలాంటి చిత్రాన్ని హిట్ చేయకపోయి ఉంటే ఇంకెవ్వరూ ఇలాంటి సాహసాలు అయితే చేసి ఉండేవారు కాదు. సినిమా ముందుకు తీసుకొచ్చిన వంశీ గారికి థాంక్స్. ఈ మూవీ టీంని, సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది’ అని అన్నారు.