టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని దాదాపు వెయ్యకి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డులలో తన పేరు నమోదు చేసుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఇందులో తండ్రీ కొడుకులు, తాత, మనవళ్లుగా వీళ్లిద్దరూ కనిపించబోతున్నారు, ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ‘మళ్లీ రావా’, :ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ‘మసూద’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ప్రొడక్షన్ నెం 5 గా బ్రహ్మానందం చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆహ్లాదకరమైన ప్రీ-లుక్ పోస్టర్ తో ఆసక్తి కరంగా వుండే టైటిల్ ఫాంట్ తో ఈ చిత్ర ప్రారంభాన్ని నటుడు బ్రహ్మానందం ప్రకటించారు. ప్రీ లుక్ పోస్టర్ సిటీ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనంగా రూపొందించారు.. గౌతమ్ తదుపరి చిత్రం గురించి బ్రహ్మానందం మరియు వెన్నెల కిషోర్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఆసక్తి గా ఉంది. పూర్తి వినోదాత్మకంగా ఉండే ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. శాండిల్య పిసపాటి సంగీతాన్ని సమకూరుస్తుండగా సినిమాటోగ్రఫీని మితేష్ పర్వతనేని అందిస్తున్నారు. ప్రసన్న సినిమాకు ఎడిట్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 6న బ్రహ్మానందం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
previous post
next post