భరత్, సంధ్య జంట గా నటించిన ప్రేమిస్తే సినిమా విడుదలై ఈరోజు కి 19 సంవత్సరాలైంది.. యువత తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతం గా ఆకర్షించిన ఈ చిత్రం అప్పట్లో ఓ పెద్ద సంచలనం.. ప్రముఖ దర్శకుడు శంకర్ సమర్పకుడిగా ఉంటే మరో ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా .. ఎస్కే పిక్చర్ బ్యానర్ పై పాత్రికేయుడు సురేష్ కొండేటి నిర్మించారు. చిత్రం విడుదలై పందొమ్మిదేళ్లు అయిన సందర్భం గా సురేష్ కొండేటి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సినిమాలో నటించిన నటీ, నటులకు, పని చేసిన సాంకేతిక నిపుణులకు, ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు..
అన్నం ఉడికింద లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు చాలు. నిర్మాతగా మనం ఏంటో చెప్పడానికి ఒక సినిమా చాలు. అభిరుచి గల నిర్మాత విలువలు కలిగిన నిర్మాత అని మొదటి సినిమాకే నాకు పేరు తెచ్చిన సినిమా… సినిమా ఆర్ధికంగా హిట్ అయితే మరొక సినిమా చేయడానికి బలం అవుతుంది, కానీ అదే సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటే, మరెన్నో సినిమాలు తీయడానికి బలం అవుతుంది. అలా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నన్ను నిర్మాత చేసిన సినిమా, నిర్మాతగా కొనసాగేలా చేసిన సినిమా ప్రేమిస్తే… సినిమా వచ్చి నేటికీ 19 సంవత్సరాలు అయిన సందర్బంగా మరీ ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన “శంకర్ గారికి,” అలాగే ఈ సినిమాకి నాతో పాటు ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న మారుతీ గారికి, తరవాతి కాలంలో ఆయన ఎంత గొప్ప దర్శకుడు అయ్యాడో మన అందరికి తెలిసిందే. ఈ సందర్భంలో ఆయనకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.అలాగే నన్ను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎంతగానో ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.