యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానున్న ఈ ట్రైలర్‌ను గమనిస్తే… దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉన్నాడు, తప్పు చేస్తున్నవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’’ అని ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తే మరో వైపు సిద్ధార్థ్ ‘మనం ఒక్కొక్కరినీ తప్పు పడుతూనే ఉంటాం. సిస్టమ్ సరిగా లేదు. సరి చేయాలని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటాం. కానీ దాన్ని సరి చేయటానికి కొంచెం కూడా ప్రయత్నించటం లేదు’ తన బాధను వ్యక్తం చేస్తాడు.. మనం మొరిగే కుక్కలం మాత్రమే.. అని ఓ యువకుడు తన ఆక్రోశాన్ని వెల్లగక్కుతుంటే వీరందరినీ చీల్చి చెండాడే ఓ వేట కుక్క రావాలి ఆయనే మళ్లీ రావాలి. అన్న సిద్ధార్థ్ రిఫరెన్స్ తో
సేనాపతి (కమల్ హాసన్)ని చూపించారు. ఫ్రీడమ్ ఫైటర్‌గా తన గురించి చెబుతూ ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే పవర్‌ఫుల్, ఎమోషనల్ డైలాగ్స్ ‘భారతీయుడు 2’ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్‌లో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ యాక్షన్ సన్నివేశాలు, వాటిని అత్యద్భుతంగా తెరకెక్కించిన శంకర్ మేకింగ్ స్టైల్ నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని ట్రైలర్ రేకెత్తిస్తోంది.
సేనాపతి పాత్రతో పాటు డిఫరెంట్ లుక్స్‌లో కమల్ హాసన్ తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ఇక మర్మకళతో విలన్స్ భరతం పట్టడాన్ని కూడా ఈ సినిమాలో మరింత విస్తృతంగా చూపించినట్లు స్పష్టమవుతుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవల్‌లో ఆవిష్కరించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న ఏషియన్ సురేష్
ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగులో, హిందుస్థానీ పేరుతో హిందీలో కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి.
రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.