ప్రతిష్ఠాత్మక యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా జూన్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అతి తక్కువ టైమ్ లో లోకి వచ్చి టాప్ 2 లో సినిమా ట్రెండింగ్ అవుతోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. థియేటర్స్ లో మంచి సక్సెస్ అందుకున్న”భజే వాయు వేగం” ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ అదే సక్సెస్ రిపీట్ చేస్తోంది.
previous post