కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చితో రెండో రోజు మూడో రోజు వసూళ్లు పెరిగాయి. “భజే వాయు వేగం” థియేటర్స్ లో ఆడియెన్స్ సందడి కనిపిస్తోంది. మంచి డ్రామా, ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. గత వారం రిలీజైన చిత్రాల్లో “భజే వాయు వేగం” బాక్సాఫీస్ లీడ్ తీసుకుంటోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీక్ “భజే వాయు వేగం” సినిమాకు అంచనాలను మించిన కలెక్షన్స్ వస్తాయని మూవీ టీమ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
previous post
next post