Vaisaakhi – Pakka Infotainment

భజే వాయు వేగం ఆ వెలితిని తీరుస్తుంది..

హీరో కార్తికేయనా కెరీర్ మొదలై ఆరేళ్లవుతోంది. ఎనిమిది తొమ్మిది సినిమాల్లో నటించాను. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ మూవీ బెదురులంక బాగా పే చేసింది. ఒక పర్పెక్ట్ మూవీతో నా అడుగు ముందుకు పడలేదని అనిపిస్తుంటుంది. ఆ వెలితిని భజే వాయు వేగం తీరుస్తుందని అన్నారు హీరో కార్తికేయ భజే వాయు వేగం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కథ విన్నప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా మూవీ అని ఎక్కువగా ఎదురుచూసింది భజే వాయు వేగం సినిమాకే. నేను ఎలాంటి కథ చేద్దామని అనుకున్నానో, నా సినిమాలో ఎలాంటి ఎమోషన్, ఎలాంటి డ్రామా ఉండాలని అనుకున్నానో, ఎలాంటి క్యారెక్టర్ పోషించాలని అనుకున్నానో..అవన్నీ వందశాతం కుదిరిన సినిమా ఇది.. కమర్షియల్ సినిమాలో ఇవి ఉండాలని కావాలని పెట్టిన సినిమా కాదిది. కథకు ఏం కావాలో అదే చేసుకుంటూ వెళ్లాం. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో సహజంగా కుదిరాయి. సినిమా చూస్తున్న వాళ్లు కథలో లీనమవుతారు. ఆ ఎమోషనల్ డ్రైవ్ నుంచే ప్రతి ఒక్క అంశాన్ని అనుభూతి చెందుతారు. కథలోని లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా వంటివన్నీ డైరెక్ట్ గా మీ మనసును తాకుతాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారంతా ఒక ప్యాషన్ తో వస్తారు. చేసే పనిలో సంతృప్తి వెతుక్కుంటారు. మా టీమ్ అందరికీ అలాంటి వెలకట్టలేని సంతృప్తినిచ్చిన సినిమా భజే వాయు వేగం. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా బెటర్ గా వచ్చేలా తమ ఎఫర్ట్స్ పెట్టారు. హీరోయిన్ ఐశ్వర్య పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొస్తుంది. రాహుల్ టైసన్ కీ రోల్ చేశాడు. తనికెళ్ల భరణి గారి పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఆర్ఎక్స్ 100 తర్వాత నాకు భజే వాయు వేగం మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.కథానాయిక ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ స్పై సినిమా కంటే ముందు నేను సైన్ చేసిన చిత్రమిదని తెలిపారు.హీరో కార్తికేయతో కలిసి నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. అతను లవ్ లీ కోస్టార్. భజే వాయు వేగం సినిమాను తప్పకుండా చూడండి అన్నారుయూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న “భజే వాయు వేగం” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్న “భజే వాయు వేగం” ట్రైలర్ విడుదల కార్యక్రమంలో యూవీ కాన్సెప్ట్స్ చైతన్య డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More